Telugu Global
National

వారి పెళ్లి అయిపోయేదే...మోడీ ఆపేశారు!

ఆ ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు న‌చ్చి వివాహం చేసుకోవాల‌నుకున్నారు. అత‌ను వ్యాపార‌వేత్త అయితే, ఆమె ప్ర‌భుత్వ ఉద్యోగిని. ఇద్ద‌రి మ‌ధ్య పెళ్లికి అంగీకారం కుదిరాక ఓ గుళ్లో క‌లిసి మిగిలిన విష‌యాలు చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌లో దేశంలోని ఆర్థిక ప‌రిస్థితి గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దేశంలో ఆర్థికాభివృద్ధి త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణం ప్ర‌ధాని మోడీయేన‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. అత‌ను మోడీ అభిమాని. దాంతో ఆమెను వ్య‌తిరేకించాడు. ఇద్ద‌రి మ‌ధ్యా ఈ విష‌యం మీద వాదోప‌వాదాలు న‌డిచాయి. ఎంత‌కీ ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌టంతో భిన్న అభిప్రాయాలు ఉన్న తామిద్ద‌రూ క‌లిసి […]

ఆ ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు న‌చ్చి వివాహం చేసుకోవాల‌నుకున్నారు. అత‌ను వ్యాపార‌వేత్త అయితే, ఆమె ప్ర‌భుత్వ ఉద్యోగిని. ఇద్ద‌రి మ‌ధ్య పెళ్లికి అంగీకారం కుదిరాక ఓ గుళ్లో క‌లిసి మిగిలిన విష‌యాలు చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌లో దేశంలోని ఆర్థిక ప‌రిస్థితి గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దేశంలో ఆర్థికాభివృద్ధి త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణం ప్ర‌ధాని మోడీయేన‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. అత‌ను మోడీ అభిమాని. దాంతో ఆమెను వ్య‌తిరేకించాడు. ఇద్ద‌రి మ‌ధ్యా ఈ విష‌యం మీద వాదోప‌వాదాలు న‌డిచాయి. ఎంత‌కీ ఎవ‌రూ త‌గ్గ‌క‌పోవ‌టంతో భిన్న అభిప్రాయాలు ఉన్న తామిద్ద‌రూ క‌లిసి ఉండ‌లేమ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. దాంతో అక్క‌డిక‌క్క‌డే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇద్ద‌రూ త‌మ ఇళ్ల‌లో ఈ విష‌యాన్ని చెప్పేశారు. కార‌ణం తెలుసుకున్న పెద్ద‌వాళ్లు తెల్ల‌బోయారు.

First Published:  7 July 2016 1:56 PM GMT
Next Story