Telugu Global
Cinema & Entertainment

బన్నీ సినిమాలో విలన్ ఇతడే...

బన్నీ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా మేటర్స్ అన్నీ సెటిల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న హీరోయిన్ గా శృతిహాసన్ ను కన్ ఫర్మ్ చేశారు. తాజాగా విలన్ ను కూడా పక్కా చేశారు. బన్నీ-హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో రావు రమేష్ విలన్ గా కనిపించనున్నాడు. గతంలో బన్నీ నటించిన జులాయి సినిమాలో పోలీస్ గా నటించిన రావు రమేష్… క్లయిమాక్స్ కు వచ్చేసరికి విలన్ ఛాయల్లో కనిపిస్తాడు. హరీష్ శంకర్ సినిమాలో మాత్రం ఈసారి […]

బన్నీ సినిమాలో విలన్ ఇతడే...
X

బన్నీ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా మేటర్స్ అన్నీ సెటిల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న హీరోయిన్ గా శృతిహాసన్ ను కన్ ఫర్మ్ చేశారు. తాజాగా విలన్ ను కూడా పక్కా చేశారు. బన్నీ-హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో రావు రమేష్ విలన్ గా కనిపించనున్నాడు. గతంలో బన్నీ నటించిన జులాయి సినిమాలో పోలీస్ గా నటించిన రావు రమేష్… క్లయిమాక్స్ కు వచ్చేసరికి విలన్ ఛాయల్లో కనిపిస్తాడు. హరీష్ శంకర్ సినిమాలో మాత్రం ఈసారి ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో రావు రమేష్ కనిపించబోతున్నాడు. గతంలో హరీష్ శంకర్ డైరక్ట్ చేసిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో రావు రమేష్ నటించాడు. అందుకు మరోసారి బన్నీ సినిమా అవకాశం అతడికే వరించింది. వాస్తవానికి ఈ సినిమాలో విలన్ గా మొదట్లో ప్రకాష్ రాజ్ ను అనుకున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ తో చాలా సినిమాలు చేశాడు బన్నీ. కానీ ప్రకాష్ రాజ్ కంటే రావు రమేష్ అయితే బాగుంటుందని హరీష్ శంకర్… బన్నీని ఒప్పించాడు. అలా బన్నీ సినిమాలో రావు రమేష్ కు మరోసారి అవకాశం దక్కింది. మరోవైపు ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరందిస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వరుసగా హిట్స్ ఇస్తున్న తమన్ ను తీసుకోవాలా… లేక తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను తీసుకోవాలా అనే అంశంపై బన్నీ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది.

First Published:  8 July 2016 6:25 AM GMT
Next Story