Telugu Global
Cinema & Entertainment

ర‌ష్మి  15 నిముషాల్లో  ఏం చేసింది..?

‘గుంటూరు టాకీస్’ చిత్రంలో తన అంద చందాలతో మెప్పించిన రేష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంతం’. జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ద‌ర్శ‌క‌ నిర్మాత గా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఊహకందనిది జరుగబోతోందంటూ’ సినిమా ప్రమోషన్లలో ఊదరగొట్టారు. మరి నిజంగానే ఈ సినిమా ప్రేక్షకుల ఊహకందని రేంజిలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ థ్రిల్ చేసిందా? లేదా? అనేది  ప్ర‌శ్న‌, విషయానికొస్తే.. వనిత (రష్మిగౌతమ్‌), కళ్యాణ్ కృష్ణ(చరణ్‌దీప్‌) భార్యా భర్తలు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సాపీగా జీవితం […]

ర‌ష్మి  15 నిముషాల్లో  ఏం చేసింది..?
X
‘గుంటూరు టాకీస్’ చిత్రంలో తన అంద చందాలతో మెప్పించిన రేష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అంతం’. జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ ద‌ర్శ‌క‌ నిర్మాత గా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఊహకందనిది జరుగబోతోందంటూ’ సినిమా ప్రమోషన్లలో ఊదరగొట్టారు. మరి నిజంగానే ఈ సినిమా ప్రేక్షకుల ఊహకందని రేంజిలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ థ్రిల్ చేసిందా? లేదా? అనేది ప్ర‌శ్న‌,
విషయానికొస్తే.. వనిత (రష్మిగౌతమ్‌), కళ్యాణ్ కృష్ణ(చరణ్‌దీప్‌) భార్యా భర్తలు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ సాపీగా జీవితం గడిపేస్తుంటారు. ఓ రోజు కళ్యాణ్ కృష్ణ ఉద్యోగ నిర్వహణలో భాగంగా విజయవాడ వెళతాడు. అతడు విజయవాడ నుండి హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వస్తుంది…నీ భార్యని కిడ్నాప్‌ చేస్తున్నామని, నీ భార్య నీకు దక్కాలంటే మేం చెప్పినట్టు చేయాలని వార్నింగ్ ఇస్తారు. భార్య కోసం వాళ్లు చెప్పిన పని చేయడానికి సిద్దమవుతాడు కళ్యాణ్ కృష్ణ. వారు చెప్పిన ప్రకారం ఓ చోటుకు వెళ్లి బ్యాగ్ తెస్తాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? ఈ కిడ్నాప్ వెనక అసలు కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది తర్వాతి కథ. అయితే ఈ చిత్రంలో ర‌ష్మి ఒక రేంజ్ లో అందాల విందు చేస్తుంది అనే విధంగా ప్ర‌చార చిత్రాల్లో బిల్డ‌ప్ ఇచ్చి…చివ‌ర‌కు సినిమాలో ఆమే రోల్ నిడివి జ‌స్ట్ 15 నిముషాల‌కు మించి లేదు. ఏదో ఉంటుంది అనే భ్రాంతి క‌లిగించి ఒక సాద సీద ఫిల్మ్ లా చేసి సినిమాను ముగించార‌నే విమ‌ర్శ‌లు చేయ‌క త‌ప్ప‌దు మ‌రి.
First Published:  9 July 2016 4:50 AM GMT
Next Story