Telugu Global
NEWS

రేవంత్‌పై చిన‌బాబుకు ఫిర్యాదుల వెల్లువ‌!

తెలంగాణ తెలుగుదేశంలో ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దుండుడుకు చ‌ర్య‌ల‌పై గుర్రుగా ఉన్న పార్టీ సీనియ‌ర్లు ఆయ‌న‌తీరుపై చిన‌బాబుకు కంప్ల‌యింట్ చేశారు. రేవంత్ దూకుడు చ‌ర్య‌ల‌కు క‌ళ్లెం వేయ‌క‌పోతే.. ఆయ‌న్ను ఆప‌డం క‌ష్ట‌మ‌ని లోకేశ్ వ‌ద్ద వాపోయిన‌ట్లు సమాచారం.  వివ‌రాలు.. శ‌నివారం తెలంగాణ తెలుగుదేశం సీనియ‌ర్‌ నేత‌ల‌తో లోకేశ్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల కంటే.. రేవంత్‌పై వెల్లువెత్తిన‌ ఫిర్యాదులే అధికంగా ఉన్నాయంట‌. కొంత‌కాలంగా తెలుగుదేశం పార్టీలో […]

రేవంత్‌పై చిన‌బాబుకు ఫిర్యాదుల వెల్లువ‌!
X
తెలంగాణ తెలుగుదేశంలో ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దుండుడుకు చ‌ర్య‌ల‌పై గుర్రుగా ఉన్న పార్టీ సీనియ‌ర్లు ఆయ‌న‌తీరుపై చిన‌బాబుకు కంప్ల‌యింట్ చేశారు. రేవంత్ దూకుడు చ‌ర్య‌ల‌కు క‌ళ్లెం వేయ‌క‌పోతే.. ఆయ‌న్ను ఆప‌డం క‌ష్ట‌మ‌ని లోకేశ్ వ‌ద్ద వాపోయిన‌ట్లు సమాచారం. వివ‌రాలు.. శ‌నివారం తెలంగాణ తెలుగుదేశం సీనియ‌ర్‌ నేత‌ల‌తో లోకేశ్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల కంటే.. రేవంత్‌పై వెల్లువెత్తిన‌ ఫిర్యాదులే అధికంగా ఉన్నాయంట‌.
కొంత‌కాలంగా తెలుగుదేశం పార్టీలో రేవంత్ దూకుడు రోజురోజుకు పెరుగుతోన్న సంగ‌తి తెలిసిందే! ఆ దూకుడు చివ‌రికి పార్టీ ఆదేశాల‌ను పెడ‌చెవిన పెట్టేదాకా వ‌చ్చింది. ఆయ‌న ఎవ‌రి మాట విన‌డం లేద‌ని, చివ‌రికి తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ ఆదేశాల‌ను సైతం లెక్కచేయ‌డం లేద‌న్న వార్త‌లు ఇటీవ‌లి కాలంలో పెరిగిపోయాయి. ఇటీవ‌ల మ‌ల్ల‌న్న సాగ‌ర్ నిర్వాసితులకు మ‌ద్ద‌తుగా రేవంత్ దీక్ష నిర్వ‌హించారు. వాస్త‌వానికి పెంచిన ఛార్జీల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు నిర్వ‌హించాల‌ని ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్‌, ఎల్ ర‌మ‌ణ నుంచి రేవంత్ కు ఆదేశాలు వ‌చ్చాయి. కానీ, రేవంత్ వాటిని లైట్ తీసుకున్నారు. త‌న సొంత అజెండాతో మ‌ల్ల‌న్న సాగ‌ర్ నిర్వాసితులకు మ‌ద్ద‌తుగా దీక్ష చేశారు. క‌నీసం దీక్ష వేదిక‌పై ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, ర‌మ‌ణ‌ల ఫొటోలు లేక‌పోవ‌డం సీనియ‌ర్ల కోపాన్ని రెట్టింపు చేసింది. సీనియ‌ర్ నేత‌లు రావుల చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి, మాజీఎంపీ నామానాగేశ్వ‌ర‌రావు, కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి ఇదే విష‌యాన్ని లోకేశ్‌కు వివ‌రించారు. పార్టీని కాద‌ని రేవంత్ త‌న‌ సొంత అజెండాతో ముందుకు సాగుతున్నాడ‌ని ఫిర్యాదు చేశారు.
రేవంత్ దూకుడు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఓటుకు నోటు కేసులో ఆయ‌న అరెస్ట‌వ‌డం. అప్ప‌టి నుంచి ఆయ‌న కేసీఆర్ పై ప‌గ పెంచుకున్నార‌నే చెప్పాలి. అందుకే, కేసీఆర్ విష‌యంలో ఎవ‌రు చెప్పినా విన‌కుండా.. సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు. మైకు దొరికితే కేసీఆర్‌ను బూతులు తిడుతున్నారు. ఇటీవ‌ల సీఎంను దూషించినందుకు ఆయ‌న‌పై పోలీసులు కేసులు కూడా న‌మోదు చేశారు. అయినా.. ఆయ‌న తీరు మారలేదు. మ‌రి ఇంత‌మంది సీనియ‌ర్లు ఫిర్యాదు చేసిన‌పుడు పార్టీ రేవంత్‌పై చ‌ర్య తీసుకుంటుందా? అంటే.. ముమ్మాటికీ తీసుకోదని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఓటుకు నోటు కేసు కొన‌సాగినంత కాలం రేవంత్ ను ఆప‌డం క‌ష్ట‌మేనంటున్నారు.
First Published:  9 July 2016 9:00 PM GMT
Next Story