Telugu Global
Cinema & Entertainment

ముద్దుగుమ్మలతో గోపీచంద్ మూడు ముక్కలాట

యాక్షన్ సినిమాలు చేసే రాజశేఖర్… అల్లరిప్రియుడు సినిమాతో ఒక్కసారిగా ఎలా మారిపోయాడో అందరికీ తెలిసిందే. ఓ రకమైన సినిమాలు చేస్తూ కెరీర్ ను కొన్నేళ్లపాటు లాగించేసిన జగపతిబాబు… శుభలగ్నం, చిలక్కొట్టుడు, మూడు ముక్కలాట లాంటి సినిమాలతో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడో కూడా చూశాం. ఇప్పుడీ కోవలోకి గోపీచంద్ కూడా చేరిపోతున్నాడనే అనిపిస్తోంది. త్వరలోనే ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట గోపీచంద్. ఒకప్పుడు విలన్ గా… హీరోయిన్ల పాలిట సింహస్వప్నంలా ఉన్న గోపీచంద్… తర్వాత యాక్షన్ హీరోగా ఎదిగాడు. […]

ముద్దుగుమ్మలతో గోపీచంద్ మూడు ముక్కలాట
X

యాక్షన్ సినిమాలు చేసే రాజశేఖర్… అల్లరిప్రియుడు సినిమాతో ఒక్కసారిగా ఎలా మారిపోయాడో అందరికీ తెలిసిందే. ఓ రకమైన సినిమాలు చేస్తూ కెరీర్ ను కొన్నేళ్లపాటు లాగించేసిన జగపతిబాబు… శుభలగ్నం, చిలక్కొట్టుడు, మూడు ముక్కలాట లాంటి సినిమాలతో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడో కూడా చూశాం. ఇప్పుడీ కోవలోకి గోపీచంద్ కూడా చేరిపోతున్నాడనే అనిపిస్తోంది. త్వరలోనే ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట గోపీచంద్.

ఒకప్పుడు విలన్ గా… హీరోయిన్ల పాలిట సింహస్వప్నంలా ఉన్న గోపీచంద్… తర్వాత యాక్షన్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత లౌక్యం, సౌఖ్యం లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆ సెక్షన్ కు మరింత దగ్గరయ్యేందుకు ఓ రొమాంటిక్ స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఇందులో గోపీచంద్ సరసన ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తారట. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఇప్పటికే క్యాథరీన్ ను ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ గా తమన్న కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. మూడో హీరోయిన్ కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇలా కెరీర్ లో తొలిసారిగా ముగ్గురు భామలతో తెరను పంచుకోబోతున్న గోపీచంద్… రాజశేఖర్, జగపతిబాబు లాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.

First Published:  10 July 2016 1:52 AM GMT
Next Story