Telugu Global
NEWS

" జనం నవ్వుకుంటారు"- చిరుపై కోదండరామి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

సినీ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. చిరంజీవి సందేశాత్మక సినిమా తీస్తే జనం నవ్వుకుంటారని అన్నారు. చిరంజీవి యాక్షన్ సినిమాలు తీసినా జనం చూడరన్నారు. తానైతే చిరుతో కామెడీ చిత్రమే తీస్తానన్నారు. చిరు 150వ సినిమా సందేశాత్మకంగా ఉంటుందన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో…చిరు సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారని కోదండరామిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. చిరు రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన నేపథ్యంలో సందేశాత్మక చిత్రాలు సరిపడవన్నది కోదండరామిరెడ్డి ఉద్దేశం […]

 జనం నవ్వుకుంటారు- చిరుపై కోదండరామి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

సినీ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిపై ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. చిరంజీవి సందేశాత్మక సినిమా తీస్తే జనం నవ్వుకుంటారని అన్నారు. చిరంజీవి యాక్షన్ సినిమాలు తీసినా జనం చూడరన్నారు. తానైతే చిరుతో కామెడీ చిత్రమే తీస్తానన్నారు. చిరు 150వ సినిమా సందేశాత్మకంగా ఉంటుందన్న టాక్ నడుస్తున్న నేపథ్యంలో…చిరు సందేశాత్మక చిత్రాలు తీస్తే జనం నవ్వుకుంటారని కోదండరామిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది.

చిరు రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన నేపథ్యంలో సందేశాత్మక చిత్రాలు సరిపడవన్నది కోదండరామిరెడ్డి ఉద్దేశం కాబోలు. విజయవాడలో రోటరీ క్లబ్‌ సమావేశంలో కోదండరామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కోదండరామిరెడ్డికి, చిరుకు మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవు. పైగా కోదండరామిరెడ్డితోనే చిరంజీవి అత్యధిక సినిమాలు కూడా చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీలు వచ్చాయి.

click on image to read-

chandrababu-pitani-ke-krish

amith sha babu

ktr-cm

narayana

adireddy-apparao

chandrababu-ranks

bhumaka-karunakar-reddy

Defected mla Budda rajashekar reddy

chandrababu-survey

ysr-jayanthi

amith shah chandra babu

chandrababu-on-pulivendula

devineni-uma

garikapati narasimha rao

First Published:  10 July 2016 2:32 AM GMT
Next Story