Telugu Global
Cinema & Entertainment

ఈసారి మహేష్ ను వదలనంటున్న హాట్ హీరోయిన్

బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఆ ముగ్గుర్లో కనీసం ఒక్క హీరోయిన్ గా అయినా సెట్ అయిపోదామని రకుల్ ప్రీత్ సింగ్ కలలు కన్నది. మేకర్స్ కూడా దాదాపు రకుల్ ను ఫిక్స్ చేసేశారు. కానీ ఆఖరి నిమిషంలో రకుల్ స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. అలా రకుల్ కు మహేష్ సరసన నటించే అవకాశం దక్కకుండా చేసింది కాజల్. అప్పట్నుంచి మహేష్ సరసన నటించాలని రకుల్ వెయిట్ చేస్తూనే ఉంది. బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ […]

ఈసారి మహేష్ ను వదలనంటున్న హాట్ హీరోయిన్
X

బ్రహ్మోత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఆ ముగ్గుర్లో కనీసం ఒక్క హీరోయిన్ గా అయినా సెట్ అయిపోదామని రకుల్ ప్రీత్ సింగ్ కలలు కన్నది. మేకర్స్ కూడా దాదాపు రకుల్ ను ఫిక్స్ చేసేశారు. కానీ ఆఖరి నిమిషంలో రకుల్ స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. అలా రకుల్ కు మహేష్ సరసన నటించే అవకాశం దక్కకుండా చేసింది కాజల్. అప్పట్నుంచి మహేష్ సరసన నటించాలని రకుల్ వెయిట్ చేస్తూనే ఉంది. బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించింది. అయితే అప్పటికే మేకర్స్ పరిణీతి చోప్రాకు ఫిక్స్ అయిపోయారు. దీంతో ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాలని రకుల్ మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది. అయితే అనుకోని అవకాశం ఊహించని విధంగా రకుల్ ను వరించింది. మహేష్ సరసన నటించే ఛాన్స్ తెచ్చిపెట్టింది.

మహేష్-మురుగదాస్ సినిమాలో పరిణీతిని తీసుకోవాలని అనుకున్నప్పటికీ… తాజా బడ్జెట్ కోతల కారణంగా, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న పరిణీతిని ప్రాజెక్టు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో తమ కోసమే ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ను మహేష్ సరసన హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. మహేష్ సరసన ఛాన్స్ కావడంతో… కాస్త రేటు తగ్గించుకొని మరీ కాల్షీట్లు కేటాయించిందట రకుల్. మరి ఈసారైనా రకుల్ కు అవకాశం దక్కుతుందా.. .లేక ఆఖరి నిమిషంలో మరోసారి మిస్ అవుతుందా… లెట్స్ వెయిట్ అండ్ సీ….

First Published:  10 July 2016 5:37 AM GMT
Next Story