Telugu Global
Cinema & Entertainment

ఈసారి కూడా సెంటిమెంట్ వదలని వైట్ల

ఇప్పటికే శ్రీనువైట్లకు భారీ ఫ్లాప్ తో కెరీర్ కు బొప్పికట్టింది. ఇలాంటి టైమ్ లో ఏ దర్శకుడైనా ఇంకాస్త ఫ్రెష్ గా ఉండే మరో కథను సెలక్ట్ చేసుకొని, తన పంథాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ శ్రీనువైట్ల మాత్రం ఏమాత్రం మారినట్టు కనిపించడం లేదు. గతంలో  తగిలిన ఆగడు దెబ్బలు, బ్రూస్ లీ తన్నుల నుంచి వైట్ల పెద్దగా ఏం నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఎంతో కష్టపడి ఎట్టకేలకు సంపాదించిన మరో సినిమా ఛాన్స్ లో […]

ఈసారి కూడా సెంటిమెంట్ వదలని వైట్ల
X

ఇప్పటికే శ్రీనువైట్లకు భారీ ఫ్లాప్ తో కెరీర్ కు బొప్పికట్టింది. ఇలాంటి టైమ్ లో ఏ దర్శకుడైనా ఇంకాస్త ఫ్రెష్ గా ఉండే మరో కథను సెలక్ట్ చేసుకొని, తన పంథాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ శ్రీనువైట్ల మాత్రం ఏమాత్రం మారినట్టు కనిపించడం లేదు. గతంలో తగిలిన ఆగడు దెబ్బలు, బ్రూస్ లీ తన్నుల నుంచి వైట్ల పెద్దగా ఏం నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే.. ఎంతో కష్టపడి ఎట్టకేలకు సంపాదించిన మరో సినిమా ఛాన్స్ లో కూడా తన పాత పద్ధతినే కొనసాగించబోతున్నాడట వైట్ల.

రేపట్నుంచి వరుణ్ తేజ హీరోగా మిస్టర్ అనే సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు వైట్ల. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ఎంతో కష్టపడి ఈ ఆఫర్ దక్కించుకున్నాడు. కానీ ఫార్ములా మాత్రం పాతదే అని వినికిడి. యాక్షన్ కు కామెడీ మిక్స్ చేసి తన రెగ్యులర్ స్టయిల్ లోనే సినిమా తీయాలని అనుకుంటున్నాడట వైట్ల. మరీ ముఖ్యంగా హీరోను ఈ సినిమాలో కూడా పోలీస్ గా చూపించడానికే ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. నిజానికి వైట్ల నమ్ముకున్న ఓ ఫార్ములా ఒకప్పుడు సూపర్ హిట్ అయింది. బాగా కాసులు కురిపించింది. కానీ ఇప్పుడదే ఫార్ములా అవుట్ డేటెడ్ అయిపోయింది. ఆ మేజిక్ తో సినిమా చేస్తే రివర్స్ లో తమకే చుక్కులు కనిపిస్తాయనే విషయాన్ని ఇప్పటికే చాలామంది మేకర్స్ రుజువు చేశారు. అయినా కూడా వైట్ల తను నమ్ముకున్న ఆ పాత ఫార్ములానే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. మరి ఈ ఫార్ములాకు వరుణ్ తేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థంకాక మెగాఫ్యాన్స్ జుట్టుపీక్కుంటున్నారు.

First Published:  10 July 2016 2:11 AM GMT
Next Story