Telugu Global
International

ఇదెక్క‌డి దిక్కుమాలిన‌ రిపోర్టింగ్ బాబూ!

ఎల‌క్ర్టానిక్ మీడియా ఎక్క‌డికి వెళుతుందో అర్థం కావ‌డం లేదు. టీఆర్ పీ రేటింగులు పెంచుకోవ‌డానికి.. రిపోర్టింగ్ ముసుగులో కొన్ని ఛాన‌ళ్లు చేస్తోన్న కార్య‌క్ర‌మాలు, వేస్తోన్న వెకిలి వేషాలు జ‌ర్న‌లిజానికే మ‌చ్చ తెచ్చేట్లుగా ఉంటున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఈ పెడ‌ధోర‌ణి పెరిగిపోతోంది.  తాజాగా పాకిస్తాన్‌లో ఓ విలేక‌రి చేసిన రిపోర్టింగ్ పై సోష‌ల్ మీడియాతోపాటు జ‌నాలు కూడా ఈస‌డించుకుంటున్నారు.  పాకిస్తాన్ మ‌ద‌ర్ థెరిస్సాగా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ మాన‌వ‌తా వాది అబ్దుల్ స‌త్తార్‌ ఈది (88) ఈనెల‌ 8న […]

ఇదెక్క‌డి దిక్కుమాలిన‌ రిపోర్టింగ్ బాబూ!
X
ఎల‌క్ర్టానిక్ మీడియా ఎక్క‌డికి వెళుతుందో అర్థం కావ‌డం లేదు. టీఆర్ పీ రేటింగులు పెంచుకోవ‌డానికి.. రిపోర్టింగ్ ముసుగులో కొన్ని ఛాన‌ళ్లు చేస్తోన్న కార్య‌క్ర‌మాలు, వేస్తోన్న వెకిలి వేషాలు జ‌ర్న‌లిజానికే మ‌చ్చ తెచ్చేట్లుగా ఉంటున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఈ పెడ‌ధోర‌ణి పెరిగిపోతోంది. తాజాగా పాకిస్తాన్‌లో ఓ విలేక‌రి చేసిన రిపోర్టింగ్ పై సోష‌ల్ మీడియాతోపాటు జ‌నాలు కూడా ఈస‌డించుకుంటున్నారు.
పాకిస్తాన్ మ‌ద‌ర్ థెరిస్సాగా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ మాన‌వ‌తా వాది అబ్దుల్ స‌త్తార్‌ ఈది (88) ఈనెల‌ 8న క‌రాచీ న‌గ‌రంలో మ‌ర‌ణించారు. అంత‌టి ప్ర‌ముఖుడు మ‌ర‌ణించ‌డంతో ఆ దేశ ప్ర‌ధాని, అధ్య‌క్షుడు, ఇత‌ర వీఐపీల‌తోపాటు మ‌న‌దేశ విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఇత‌ర ప్ర‌ముఖులు కూడా సంతాపం ప్ర‌క‌టించారు. ఇది పాకిస్తాన్‌లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉదార‌వాది, మాన‌వ‌తా వాది అన్న గుర్తింపు ఉంది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే.. ఎల‌క్ర్టానిక్ ఛాన‌ళ్ల హ‌డావిడి మొదలైంది.
అప్పుడు న్యూస్ ఎక్స్‌ప్రెస్ అనే ఛాన‌ల్ విలేక‌రి వెంట‌నే స్పందించాడు. ఆయ‌న జీవిత విశేషాల‌ను ప్రేక్ష‌కుల‌కు కొత్త ప‌ద్ధ‌తిలో అందించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డాడు. ఆ తొంద‌ర‌లో క‌నీస విలువ‌లు పాటించ‌డం మ‌ర్చిపోయాడు. వాస్త‌వానికి ఈది త‌న మ‌ర‌ణానంత‌రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు వీలుగా 25 ఏళ్ల క్రిత‌మే ఓ స‌మాధిని ముంద‌స్తుగా నిర్మించుకున్నారు. ఈ విష‌యం గుర్తుకురాగానే స‌ద‌రువిలేక‌రి ఆయ‌న స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాడు. అందులో ప‌డుకున్నాడు. అప్పుడు కెమెరా రోలింగ్ ప్రారంభ‌మైంది. ఇక మ‌నోడు ఈది గొప్ప‌త‌నం, ఆయ‌న జీవిత విశేషాల‌ గురించి స‌మాధిలో నుంచే రిపోర్టింగ్ మొద‌లు పెట్టాడు. తాను చేసిన ఘ‌న‌కార్యాన్ని ట్విట్ట‌ర్‌లో పెట్టాడు. అంతే.. అత‌డిపై నెటిజ‌న్లంతా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది దిగ‌జారిన జ‌ర్న‌లిజానికి ప‌రాకాష్ట అని మండిప‌డుతున్నారు. టీఆర్‌పీ రేటింగుల కోసం గొప్ప‌వ్యక్తుల‌ను అవ‌మాన‌పర‌చాలా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  10 July 2016 8:01 PM GMT
Next Story