Telugu Global
National

రాహుల్ పెళ్లి వార్త‌లు నిజ‌మేనా?

రాహుల్ పెళ్లి ఎప్పుడు? ఇంత‌కాలం ఈ ప్ర‌శ్న‌కు మిలియ‌న్ డాల‌ర్లు ప్రైజ్ మ‌నీ ఇస్తామ‌న్నా.. లోక‌మంతా బిక్క‌ముఖం వేసిందే గానీ, ఏనాడూ స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. ఇక ఈ ప్ర‌శ్న‌కు న‌ర‌మాన‌వుడు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు అనుకుంది దేశ‌మంతా. కానీ, ఇప్పుడు ఈ ప్ర‌శ్న కు త్వ‌ర‌లోనే ఓ ఆన్స‌ర్ దొర‌క‌నుంది. విష‌య‌మేంటంటే..? త‌్వ‌ర‌లోనే రాహుల్ గాంధీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నిజ‌మా?  ఎవ‌రు ఆ అమ్మాయి..? ఇంత‌కీ రాహుల్ ది ప్రేమ వివాహ‌మా?  పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? […]

రాహుల్ పెళ్లి వార్త‌లు నిజ‌మేనా?
X
రాహుల్ పెళ్లి ఎప్పుడు? ఇంత‌కాలం ఈ ప్ర‌శ్న‌కు మిలియ‌న్ డాల‌ర్లు ప్రైజ్ మ‌నీ ఇస్తామ‌న్నా.. లోక‌మంతా బిక్క‌ముఖం వేసిందే గానీ, ఏనాడూ స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. ఇక ఈ ప్ర‌శ్న‌కు న‌ర‌మాన‌వుడు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు అనుకుంది దేశ‌మంతా. కానీ, ఇప్పుడు ఈ ప్ర‌శ్న కు త్వ‌ర‌లోనే ఓ ఆన్స‌ర్ దొర‌క‌నుంది. విష‌య‌మేంటంటే..? త‌్వ‌ర‌లోనే రాహుల్ గాంధీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నిజ‌మా? ఎవ‌రు ఆ అమ్మాయి..? ఇంత‌కీ రాహుల్ ది ప్రేమ వివాహ‌మా? పెద్ద‌లు కుదిర్చిన పెళ్లా? ఇలాంటి చ‌ర్చ మొద‌లైంది. నారు పోసిన వాడే నీరు పోస్తాడ‌న్న‌ట్లుగా.. ఈవార్త‌ను మీడియాకు లీక్ చేసిన వారే స‌మాధానాలు కూడా వెల్ల‌డించారు.
విష‌యం మీడియాకు లీక్ చేసింది? ఎవ‌రో కాదు! కాంగ్రెస్ పార్టీని వారానికోసారి ముప్ప‌తిప్ప‌లు పెట్టే సుబ్ర‌మ‌ణ్య స్వామి! ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ట్వీట్ చేసి వెల్ల‌డించారు. నాకో విష‌యం తెలిసింది. బుద్దూ (రాహుల్ కు ఆయ‌న పెట్టుకున్న పేరు) కు పెళ్లి కుదిరింది. అమ్మాయిది ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌. ఓ బ్రాహ్మ‌ణ‌ యువ‌తి అని వెల్ల‌డించాడు. దీంతో ఈ విష‌యం ఇప్పుడు మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కానీ, స‌మాధానం చెప్పేందుకు రాహుల్ అందుబాటులో లేరు క‌దా!
ఇప్ప‌టిదాకా లోకానికి తెలిసి రాహుల్ కు రెండు ప్రేమ‌క‌థ‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి అఫ్గ‌నిస్తాన్ యువ‌రాణి నోహ‌ల్ జ‌హ‌ర్‌తో ఆయ‌న కొంత‌కాలం ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపార‌ని వార్త‌లు వ‌చ్చాయి. త‌రువాత స్పానిష్ కు చెందిన వెరోనికాతో ఆయ‌న ప‌లుమార్లు మీడియాకు క‌నిపించారు. వీరు పెళ్లి చేసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా.. అవేమీ నిజం కాలేదు. ఈసారి యువ‌రాజు పెళ్లి త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని అంతా విశ్వ‌సిస్తున్నారు. ఎందుకంటే చెప్పింది లిటిగేష‌న్ స్వామి కాబ‌ట్టి!
First Published:  11 July 2016 1:01 AM GMT
Next Story