Telugu Global
Cinema & Entertainment

లంకలో గ్యారేజ్ పెట్టబోతున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ గురించి తప్ప మరో అంశం గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. ఎందుకంటే… ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ తరుముకొస్తోంది. సినిమా విడుదల చేయడానికి సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చేనెల 12వ తేదీకి సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోకి వదలాల్సిందే. ఈ గ్యాప్ లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేయాలి, ఆడియో కూడా విడుదల చేయాలి. అందుకే ఎన్టీఆర్ […]

లంకలో గ్యారేజ్ పెట్టబోతున్న ఎన్టీఆర్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ గురించి తప్ప మరో అంశం గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. ఎందుకంటే… ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ తరుముకొస్తోంది. సినిమా విడుదల చేయడానికి సరిగ్గా ఈ రోజుకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చేనెల 12వ తేదీకి సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోకి వదలాల్సిందే. ఈ గ్యాప్ లోనే షూటింగ్ కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేయాలి, ఆడియో కూడా విడుదల చేయాలి. అందుకే ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే పెట్టాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ప్రస్తుతం లంకకు వెళ్లేందుకు యూనిట్ సిద్ధమౌతోంది. కొలంబోలో ఎన్టీఆర్-సమంత మధ్య ఓ సాంగ్ పిక్చరైజ్ చేయాలని నిర్ణయించారు. 3 రోజుల్లో ఈ పాట కంప్లీట్ చేసి, తిరిగి హైదరాబాద్ వచ్చి మిగతా టాకీ పార్ట్ పూర్తిచేయాలనే ఆలోచనలో యూనిట్ ఉంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు 90శాతం పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఈనెలాఖరుకు ఫస్ట్ కాపీని సిద్ధంచేసి, వచ్చేనెల 1 నుంచి అధికారికంగా ప్రమోషన్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. అప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి పనులు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత తో పాటు నిత్యామీనన్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  11 July 2016 3:57 AM GMT
Next Story