Telugu Global
NEWS

జానాకు పొగ బెడుతున్న‌ది వాళ్లే!

కొంత‌కాలంగా జానారెడ్డి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌న్న మాట‌ల వెన‌క అంత‌రార్థం తెలిసిపోయింది. ఆయ‌న ఈ మాట‌ల‌న‌డానికి కార‌ణం ఏంటో ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వెల్ల‌డించారు. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి సోద‌రులు పెడుతున్న ఇబ్బందులను భ‌రించ‌లేకే ఆయ‌న రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టిస్తున్నార‌ని చెప్పారు. ఆయ‌న ప‌రిస్థితి అంత‌ ద‌య‌నీయంగా ఉన్నందువ‌ల్లే తాము పార్టీ నుంచి ముందుగానే బ‌య‌ట‌ప‌డ్డామ‌ని వివ‌రించారు. పార్టీని 12 మంది వ్య‌క్తులు నిలువునా ముంచార‌ని ఆరోపించారు. ఎవ‌రికి వారు […]

జానాకు పొగ బెడుతున్న‌ది వాళ్లే!
X
కొంత‌కాలంగా జానారెడ్డి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌న్న మాట‌ల వెన‌క అంత‌రార్థం తెలిసిపోయింది. ఆయ‌న ఈ మాట‌ల‌న‌డానికి కార‌ణం ఏంటో ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వెల్ల‌డించారు. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి సోద‌రులు పెడుతున్న ఇబ్బందులను భ‌రించ‌లేకే ఆయ‌న రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టిస్తున్నార‌ని చెప్పారు. ఆయ‌న ప‌రిస్థితి అంత‌ ద‌య‌నీయంగా ఉన్నందువ‌ల్లే తాము పార్టీ నుంచి ముందుగానే బ‌య‌ట‌ప‌డ్డామ‌ని వివ‌రించారు. పార్టీని 12 మంది వ్య‌క్తులు నిలువునా ముంచార‌ని ఆరోపించారు. ఎవ‌రికి వారు సీఎం అభ్య‌ర్థుల‌ని ప్ర‌క‌టించుకోవ‌డంతోనే ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని వాపోయారు.
పెద్ద‌లు జానారెడ్డి కూడా ఈ విష‌యంలో ప‌లుమార్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒకే పార్టీలో ఉంటూ కొంద‌రు తాను పార్టీ మారుతున్నానంటూ త‌ప్పుడు వార్త‌లు రాయిస్తున్నార‌ని ఇటీవ‌ల జానా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీలో ఎవ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. తాను వెంట‌నే స్పందిస్తున్నాన‌ని.. కానీ త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు ? అని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే! ఇటీవ‌ల 2019లో సీఎం అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అని, ఈ మేర‌కు ఢిల్లీ నుంచి హామీ వ‌చ్చింద‌ని, అందుకే ఆయ‌న టీఆర్ ఎస్ లో చేరే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై వెంట‌నే జానా స్పందించారు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఎవ‌రు ఉన్నా.. 2019లో తానే సీఎం అని ప్ర‌క‌టించేశారు. అంటే.. జానా వ‌ర్గానికి, కోమ‌టిరెడ్డి సోద‌రులకు, టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ వ‌ర్గాల‌తో అస్స‌లు పొస‌గ‌డం లేద‌న్న విష‌యం ఈ మాట‌ల‌తో తేట‌తెల్లం అవుతోంది.
జానారెడ్డి పార్టీ మార‌తారో లేదో తెలియ‌దు గానీ, ఇటీవ‌లి కాలంలో ఆయ‌న‌పై మీడియాకు లీకులు మాత్రం పెరిగిన మాట వాస్త‌వం. ఆయ‌న గులాబీ పార్టీలో చేర‌తార‌ని, రాజ్య‌స‌భ టికెట్ అడిగార‌ని ఇలా ప‌లు ర‌కాల పుకార్లు షికార్లు చేశాయి. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై జానా స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్న‌ట్లు తెలిసింది. నిన్న‌గాక మొన్న పార్టీలో చేరిన వారు.. త‌న‌కు పొగ‌బెట్టాల‌ని చేస్తోన్న‌ ప్ర‌య‌త్నాలు చెప్పుకుని బాధ‌ప‌డుతున్నార‌ట‌. పార్టీలో పెరిగిన వ‌ర్గ‌పోరుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇవి తారాస్థాయికి చేరితే.. పార్టీ మ‌నుగ‌డ‌కు మ‌రింత ముప్పు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.
First Published:  11 July 2016 9:00 PM GMT
Next Story