Telugu Global
International

బ్రిట‌న్‌లో థాచ‌ర్ త‌రువాత... థెరిసా!

బ్రిట‌న్‌లో ఉక్కుమ‌హిళ‌గా పేరు పొందిన మార్గ‌రేట్ థాచ‌ర్ త‌రువాత ఆ దేశానికి రెండో మ‌హిళా ప్ర‌ధానిగా థెరిసా మే బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.  ప్ర‌స్తుత ప్ర‌ధాని డేవిడ్ కామెరాన్ ఈ విష‌యాన్ని సోమ‌వారం ప్ర‌క‌టించారు. థెరిసా (59) ప్ర‌స్తుతం దేశ హోం మంత్రిగా ఉన్నారు. యురోపియ‌న్ యూనియ‌న్ నుండి బ్రిట‌న్ వైదొల‌గ‌డాన్ని వ్య‌తిరేకించిన డేవిడ్ కామెరాన్, బ్రెగ్జిట్‌కి అనుకూలంగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ తీర్పు వెలువ‌డిన అనంత‌రం, తాను ప్ర‌ధాని ప‌ద‌వి నుండి వైదొల‌గ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన సంగ‌తి […]

బ్రిట‌న్‌లో ఉక్కుమ‌హిళ‌గా పేరు పొందిన మార్గ‌రేట్ థాచ‌ర్ త‌రువాత ఆ దేశానికి రెండో మ‌హిళా ప్ర‌ధానిగా థెరిసా మే బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ప్ర‌స్తుత ప్ర‌ధాని డేవిడ్ కామెరాన్ ఈ విష‌యాన్ని సోమ‌వారం ప్ర‌క‌టించారు. థెరిసా (59) ప్ర‌స్తుతం దేశ హోం మంత్రిగా ఉన్నారు. యురోపియ‌న్ యూనియ‌న్ నుండి బ్రిట‌న్ వైదొల‌గ‌డాన్ని వ్య‌తిరేకించిన డేవిడ్ కామెరాన్, బ్రెగ్జిట్‌కి అనుకూలంగా ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ తీర్పు వెలువ‌డిన అనంత‌రం, తాను ప్ర‌ధాని ప‌ద‌వి నుండి వైదొల‌గ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈయూతో బ్రెగ్జిట్ చ‌ర్చ‌ల‌ను సైతం నూత‌న ప్ర‌ధానే ముందుకు తీసుకువెళ‌తార‌ని కామెరాన్ ప్ర‌క‌టించి ఉన్నారు.

ప్ర‌ధాని ప‌ద‌వికోసం అధికార క‌న్స‌ర్వేటివ్ పార్టీలో థెరిసాతో పోటీ ప‌డిన ఇంధ‌న శాఖా మంత్రి ఆంద్రియా లీడ్స‌మ్ (53), తాను పోటీనుండి త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌కటించ‌డంతో పాటు, థెరిసాని బ‌ల‌మైన నాయ‌కురాలిగా పేర్కొన‌టంతో ఆమె ఎన్నిక ఏక‌గ్రీవంగా మారింది. డేవిడ్ కామెరాన్ రాజీనామా ప్ర‌క్రియ బుధ‌వారంతో ముగుస్తుంది. ఆయ‌న చివ‌రి మంత్రివ‌ర్గ భేటికి హాజ‌రు కావ‌టం, చివ‌రి ప్ర‌శ్న‌ల‌కోసం హౌస్ ఆఫ్ కామ‌న్స్‌కు హాజ‌రుకావ‌టం, బ‌కింగ్‌హామ్ ప్యాల‌స్‌కు వెళ్లి రెండో ఎలిజిబెత్ రాణికి త‌న రాజీనామాను స‌మ‌ర్పించ‌డం బుధ‌వారంతో పూర్త‌వుతాయి. ఈ విష‌యాల‌ను వెల్ల‌డించిన డేవిడ్ కామెరాన్‌, థెరిసా బ‌ల‌మైన నాయ‌కురాల‌ని, భ‌విష్య‌త్తులో దేశానికి అవ‌స‌ర‌మైన నాయ‌క‌త్వాన్ని అందించ‌గ‌ల స‌మ‌ర్ధురాల‌ని మెచ్చుకున్నారు.

First Published:  11 July 2016 10:08 PM GMT
Next Story