Telugu Global
NEWS

బాబు పాలనపై సినిమా? స్టోరి ఇదే, భగ్గుమంటున్న బాబు ఫ్యాన్స్

మహేష్ కత్తి. సినీ నటుడు, సినీ విమర్శకుడిగానూ ఇతడికి మంచి పేరుఉంది. ఇప్పుడు మహేష్ కత్తి కొత్త ప్రయోగానికి సిద్దమయ్యారు. సోషల్ మీడియా ద్వారా సినిమా స్టోరీ లైన్ వెల్లడించాడు. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా సినిమా తీస్తానని ప్రకటించారు. అయితే ఇది చంద్రబాబు పరిపాలనను వ్యతిరేకిస్తూ తీస్తున్న సినిమా అంటూ టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ వాళ్లే కాదు మిగిలిన వారు కూడా అలాగే భావించి సినిమాకు ఫండింగ్ చేసేందుకు కూడా ముందుకొస్తున్నారు.  మహేష్ కత్తి […]

బాబు పాలనపై సినిమా?  స్టోరి ఇదే, భగ్గుమంటున్న బాబు ఫ్యాన్స్
X

mahesh-kathiమహేష్ కత్తి. సినీ నటుడు, సినీ విమర్శకుడిగానూ ఇతడికి మంచి పేరుఉంది. ఇప్పుడు మహేష్ కత్తి కొత్త ప్రయోగానికి సిద్దమయ్యారు. సోషల్ మీడియా ద్వారా సినిమా స్టోరీ లైన్ వెల్లడించాడు. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా సినిమా తీస్తానని ప్రకటించారు. అయితే ఇది చంద్రబాబు పరిపాలనను వ్యతిరేకిస్తూ తీస్తున్న సినిమా అంటూ టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీడీపీ వాళ్లే కాదు మిగిలిన వారు కూడా అలాగే భావించి సినిమాకు ఫండింగ్ చేసేందుకు కూడా ముందుకొస్తున్నారు. మహేష్ కత్తి తయారు చేసిన స్టోరి లైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే…

”నూతన్ ప్రదేశ్ ముఖ్యమంత్రి “సింగపూర్” సూరిబాబుని రైతు సరోజమ్మ, స్టూడెంట్ లీడర్ తేజ, స్కూల్ ప్యూన్ కేశవులు కిడ్నాప్ చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చెయ్యకుండా భర్త ఆత్మహత్యకు సూరిబాబు కారణమయ్యాడని సరోజమ్మకు కోపం. ఇంటికో ఉద్యోగమన్న సూరిబాబు స్లోగన్‌తో ఫ్లాట్ అయిన తేజ, తన ఇంటికి కూడా ఉద్యోగం ఒస్తుందనే ఆశతో ఇంటింటికీ తిరిగి ఓట్లేయించాడు. ఇంటికొకటి కాదు కదా రాష్ట్రంలో ఒక్కటికూడా కొత్త ఉద్యోగం సృష్టించకపోగా, ఉన్న జీవనోపాధుల్ని కూడా పోగొడుతున్న సూరిబాబంటే పరమ కసి తేజకు. స్కూల్ ప్యూన్ అయినప్పటికీ ఫీజ్ రీయింబర్సుమెంట్ పుణ్యమా అని పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసన్ చదివిస్తున్నాడు కేశవులు. ఎన్నికలయ్యాక ఈ విషయంలో సూరిబాబు ఏ నిర్ణయమూ తీసుకోని కారణంగా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందనే భయంతో సూరిబాబంటే అసహ్యాన్ని పెంచుకున్నాడు కేశవులు.

ఈ ముగ్గురికీ ఉన్నది ఒక్కోఎకరం పొలం. ఇప్పుడు అదికూడా కొత్తరాజధానికోసం కాపుకాసి మరీ లాక్కుంటున్న సూరిబాబుని ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. నూతన్ ప్రదేశ్ కొత్తరాజధానిని సింగపూర్ చెయ్యాలని పట్టుబట్టి పొలాలు లాక్కొనే పనిలో భాగంగా గెస్ట్ హౌస్ లో ఉన్న సూరిబాబుని తెలివిగా ముగ్గురు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపింగ్ లో జరిగిన చిన్న యాక్సిడెంట్ కారణంగా ’సింగపూర్’సూరిబాబుకి టెంపరరీ మెమరీలాస్ వస్తుంది. రివెంజ్ తీర్చుకుందామనుకుంటే అసలు మెమరీనే లేని సూరిబాబు చేతిలోకి వచ్చేసరికీ సరోజమ్మ, తేజ, కేశవులుకు ఏం చెయ్యాలో అర్థంకాదు.

సేఫ్టీ కోసం అతని గడ్డం తీసేసి రూపురేఖలు కొంత మారుస్తారు. ముఖ్యమంత్రి మిస్ అయ్యాడని తెలిస్తే నూతన్ ప్రదేశ్ అల్లరి అయిపోవడంతో పాటూ కార్పొరేట్ లాబీ తన సపోర్ట్ ఎక్కడ లాగేసుకుంటుందో అనే భయంతో సూరిబాబు కొడుకు మండలేష్, లేని సూరిబాబు గెస్ట్ హౌస్ లోనే ఉన్నట్టుగా నాటకం మొదలుపెడతాడు. మెమరీలేని సూరిబాబుని బాగుచెయ్యడానికి తేజ తన సైక్రియాటిస్ట్ గర్ల్ ఫ్రెండ్ ప్రియ హెల్ప్ అడుగుతాడు. ప్రియ థెరపీలో జరిగే ఫన్నీ మిస్టేక్ వల్ల సూరిబాబు తనని తాను భూమి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య అనుకుంటాడు. సింగపూర్ సూరిబాబు విధానాలకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనని తాను రాజయ్య అనుకుంటున్న సూరిబాబే ఉద్యమం లేవదీస్తాడు.సరోజమ్మ-తేజ-కేశవులు క్రియాశీలకంగా ఆ ఉద్యమంలో భాగం అవుతారు.

గెస్ట్ హౌస్ లో లేని సూరిబాబుని ఉన్నాడని నమ్మిస్తూ మండలేష్ తనే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు.రాజయ్యలాగా ఉద్యమం చేస్తున్న సూరిబాబుని చంపించే ప్రయత్నంలో తండ్రి అనే నిజం తెలిసినా చంపెయ్యడానికే మండలేష్ ట్రైచేస్తాడు. చివర్లో మెమరీ రికవర్ అయిన ’సింగపూర్’సూరిబాబు తన తప్పు తెలుసుకుంటాడా ? లేదా ! అనేది అసలు కథ.

అయితే ఈ కథపై టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఈ స్టోరిలైన్ ఎంత వరకు తెరకెక్కుతుందో!.

Click on Image to Read –

ys-jagan-yatra

buggana-rajendranath-reddy

chandrababu-naidu

chandrababu-psyco

vijaya-sai-reddy

buggana-rajendranath-reddy

sujay-krishna-ranga-rao

babu-rank

ys-jagan-undavalli

ys-jagan

undavalli-harsha-kumar

kavitha-on-chandrababu

kcr-hero-krishna

dhoni-love-story

mla-srikanth-reddy

gattamaneni

babu-comedy

kcr harita haram

tdp-naidu

bhuma-gangula

Palle-Raghunatha-Reddy

jagan-gottipati

amaravathi-chandrababu-naid

lokesh-focus-on-teachers

First Published:  13 July 2016 9:48 AM GMT
Next Story