Telugu Global
NEWS

కాంగ్రెస్ రైతు గ‌ర్జ‌న విజ‌య‌వంత‌మవుతుందా?

అదును చూసి విత్తు చ‌ల్లాలి – ఇది వ్య‌వ‌సాయ సూత్రం. కీలెరిగి వాత పెట్టాలి.. ఇది నాటు వైద్య నియ‌మం.. పూల‌మ్మే చోట క‌ట్టెల‌మ్మ‌కూడ‌దు ఇది వ్యాపారం.. స‌మ‌స్య‌లున్న‌ప్పుడే ప్ర‌తిప‌క్షం చెల‌రేగాలి – ఇది రాజ‌కీయం.. వీటిలో అన్ని సూత్రాలు చెప్పేదొక్క‌టే! స‌మ‌యానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తే విజ‌యాలు వరిస్తాయ‌ని. కానీ, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. టీపీసీసీ చీఫ్ ఈనెల 30న రాష్ట్రంలో రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌పై రైతు గ‌ర్జ‌న‌ను నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. దీనికి […]

కాంగ్రెస్ రైతు గ‌ర్జ‌న విజ‌య‌వంత‌మవుతుందా?
X
అదును చూసి విత్తు చ‌ల్లాలి – ఇది వ్య‌వ‌సాయ సూత్రం. కీలెరిగి వాత పెట్టాలి.. ఇది నాటు వైద్య నియ‌మం.. పూల‌మ్మే చోట క‌ట్టెల‌మ్మ‌కూడ‌దు ఇది వ్యాపారం.. స‌మ‌స్య‌లున్న‌ప్పుడే ప్ర‌తిప‌క్షం చెల‌రేగాలి – ఇది రాజ‌కీయం.. వీటిలో అన్ని సూత్రాలు చెప్పేదొక్క‌టే! స‌మ‌యానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తే విజ‌యాలు వరిస్తాయ‌ని. కానీ, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. టీపీసీసీ చీఫ్ ఈనెల 30న రాష్ట్రంలో రైతులు ప‌డుతున్న ఇబ్బందుల‌పై రైతు గ‌ర్జ‌న‌ను నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. దీనికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దిగ్విజ‌య్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌వుతున్నారు. ఈ స‌భ విజ‌య‌వంతానికి కాంగ్రెస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. జ‌న స‌మీక‌ర‌ణ‌కు, స‌భ స్థ‌లం ఇత‌ర ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంది. దండిగా వాన‌లు కురుస్తోన్న ఈస‌మ‌యంలో రైతుగ‌ర్జ‌న ఎంత‌మేర‌కు విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్నస‌మాధానం
లేని ప్ర‌శ్నగా మారింది.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న క‌రువు, పంట‌ల‌కు నీరివ్వ‌లేని అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం అన్న రెండు ప్ర‌ధానాంశాలే అజెండాగా ఉత్త‌మ్ ఈ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. పాపం! ఈ స‌భ ఏర్పాటులో ఆయ‌న బాగానే జాప్యం చేశారు. ఈసారి తాండ‌వించే ప‌రిస్థితులు కాన‌రావ‌డం లేదు. మ‌రోవైపు దేశం, తెలుగురాష్ర్టాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం చేప‌ట్టిన మిష‌న్ కాక‌తీయ ప‌నుల పుణ్య‌మాని చెరువుల త‌వ్వ‌కాలు బాగానే జ‌రిగాయి. ఫ‌లితంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు 70 శాతం వ‌ర‌కు నీటితో నిండి క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మ‌రికొన్ని చెరువులు నూటినికి నూరు శాతం నిండాయి. మ‌రోవైపు తెలంగాణ‌లోని కీల‌క‌ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, ఎల్లంపెల్లి ప్రాజెక్టులు వ‌ర‌ద‌నీటితో నిండుకుండల‌ను త‌ల‌పిస్తున్నాయి.
వ‌ర్షాలు సంతృప్తిక‌రంగా కురుస్తుండ‌టంతో రైతులు పొలం ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌య్యారు. చెరువులు, ప్రాజెక్టులు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం రైతుల‌కు నీరివ్వ‌డం లేద‌ని, రాష్ట్రంలో క‌ర‌వు తాండ‌విస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఎలా మాట్లాడతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మంగ‌ళ‌వారం కూడా టీపీసీసీ చీఫ్ రైతు స‌మ‌స్య‌ల్లో సాగునీరు, క‌రువులే త‌మ స‌భ ప్ర‌ధాన ఎజెండా అని ప్ర‌క‌టించారు. ఇవే స‌మ‌స్య‌లు అజెండాగా స‌భ నిర్వ‌హిస్తే… అభాసుపాల‌య్యే అవ‌కాశాలు పుష్కలం. కాంగ్రెస్ నేత‌లు సాగునీరు, క‌రువు కాకుండా భూసేక‌ర‌ణ‌, రైతు రుణ‌మాఫీ విష‌యాలు అజెండాగా స‌భ పెడితే బాగుంటుందేమోన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
First Published:  12 July 2016 9:09 PM GMT
Next Story