Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో విజయశాంతి

అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి 150వ సినిమాలో విజయశాంతి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు కత్తిలాంటోడు యూనిట్ నుంచి కొందరు వెళ్లి విజయశాంతితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే కత్తిలాంటోడు సినిమాలో విజయశాంతికి ఎలాంటి పాత్ర ఆఫర్ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవితో కలిసి నటించడానికి విజయశాంతి ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరూ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న […]

చిరంజీవి సినిమాలో విజయశాంతి
X
అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి 150వ సినిమాలో విజయశాంతి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు కత్తిలాంటోడు యూనిట్ నుంచి కొందరు వెళ్లి విజయశాంతితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే కత్తిలాంటోడు సినిమాలో విజయశాంతికి ఎలాంటి పాత్ర ఆఫర్ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవితో కలిసి నటించడానికి విజయశాంతి ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇద్దరూ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లే. చిరంజీవి తన రీఎంట్రీ మూవీగా కత్తిలాంటోడు సినిమాను పట్టాలపైకి తెచ్చాడు. విజయశాంతి మాత్రం ఓ మంచి కథ కోసం ఎదురుచూస్తోంది. ఈ గ్యాప్ లో కత్తిలాంటోడు సినిమాలో ఓ పాత్ర కోసం విజయశాంతిని కలిశారు చిరంజీవి టీం సభ్యులు.
కత్తిలాంటోడు సినిమాలో ఇప్పటికే రమ్యకృష్ణను తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమెను తప్పించి ఆ పాత్ర కోసమే విజయశాంతిని సంప్రదిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని ఇటు విజయశాంతి కానీ, అటు వినాయక్ కానీ ఎవరూ ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. విజయశాంతి ఒప్పుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. కానీ చిరంజీవి, విజయశాంతి మధ్య విబేధాల కారణంగా… మెగాస్టార్ సినిమాలో నటించడానికి విజయశాంతి ఒప్పుకుంటుందా అనేది పెద్ద డౌట్. మరోవైపు తన రీఎంట్రీ ఇంతకంటే మంచి అవకాశం రాదని కూడా విజయశాంతి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుతెరపై చిరంజీవి-విజయశాంతిది సూపర్ హిట్ జోడీ. వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ… చిరంజీవి మెగాస్టార్ గా అవతరిస్తే… విజయశాంతి సౌతిండియా లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. ఛాలెంజ్, స్వయంకృషి, అత్తకుయముడు-అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, యుద్ధభూమి, రుద్రనేత్ర… ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి.
First Published:  13 July 2016 4:47 AM GMT
Next Story