Telugu Global
Cinema & Entertainment

నాయ‌కి భయపెడుతుందా ? నవ్విస్తుందా ?

న‌టిగా ఇక త్రిష ప‌ని అయిపోయింది అనుకున్న ప్ర‌తిసారి .. మ‌రింత ఘ‌న విజ‌యంతో ఆడియ‌న్స్ ను అలరిస్తూ హిట్ సొంతం చేసుకొనే న‌టి మ‌ణుల్లో త్రిష ఒక‌రు. న‌టిగా త్రిష ప్ర‌తిభా ఏమిటి అనేది తెలుగు ఆడియ‌న్స్ కు సుప‌రిచిత‌మే. వ‌ర్షం, చిత్రం…నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు త్రిష ను త‌మ ప‌క్కంటి అమ్మాయిగా రీచ్ చేశాయి. అయితే ఎంత‌టి గ్లామ‌ర్ హీరోయిన్ కైన ఒక గ్యాప్ రాక త‌ప్ప‌దు. త్రిష కు ప్ర‌స్తుతం […]

నాయ‌కి భయపెడుతుందా ? నవ్విస్తుందా ?
X

న‌టిగా ఇక త్రిష ప‌ని అయిపోయింది అనుకున్న ప్ర‌తిసారి .. మ‌రింత ఘ‌న విజ‌యంతో ఆడియ‌న్స్ ను అలరిస్తూ హిట్ సొంతం చేసుకొనే న‌టి మ‌ణుల్లో త్రిష ఒక‌రు. న‌టిగా త్రిష ప్ర‌తిభా ఏమిటి అనేది తెలుగు ఆడియ‌న్స్ కు సుప‌రిచిత‌మే. వ‌ర్షం, చిత్రం…నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు త్రిష ను త‌మ ప‌క్కంటి అమ్మాయిగా రీచ్ చేశాయి. అయితే ఎంత‌టి గ్లామ‌ర్ హీరోయిన్ కైన ఒక గ్యాప్ రాక త‌ప్ప‌దు. త్రిష కు ప్ర‌స్తుతం అదే ప‌రియ‌డ్ లో ఉంది.
అయితే ఆఫ‌ర్స్ రాకుండ డౌన్ స్టేజ్ లో మాత్రం లేదు. న‌టిగా త‌న చిత్రాల క‌థ‌లు ప్రేమ క‌థ‌ల నుంచి.. దెయ్యాల క‌థ‌ల‌కు మారాయి. ఆ మ‌ధ్య చంద్ర క‌ళ తో మెప్పించిన త్రిష‌… లేటెస్ట్ గా నాయ‌కిగా తెలుగు, త‌మిళ్ ఆడియ‌న్స్ ను భ‌య పెడుతూ న‌వ్వించ‌డానికి సిద్దం అవుతుంది. త్రిష స‌ర‌స‌న రాజేష్ పిట్ల కీ రోల్ చేస్తున్నాడు. గోవి ద‌ర్శ‌త్వంలో ద్వి భాషా చిత్రంగా ఈ సినిమా ను గిరిధ‌ర్ మామిళ్ల ప‌ల్లి నిర్మించారు. రెట్రో హ‌ర‌ర్ గా ఈసినిమాను చేశామంటున్నారు ద‌ర్శ‌కులు. ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని అల‌రించ‌డానికి నాయ‌కి సిద్ద‌మైన విష‌యం తెలిసిందే.

First Published:  13 July 2016 1:38 AM GMT
Next Story