Telugu Global
NEWS

రండి బాబు.. రండీ..! గెలుపు గుర్రాలు కావ‌లెను!

మీరు ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలా?  మీకు మీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచే స‌త్తా ఉందా? అంగ బ‌లం, అర్థ‌బ‌లం దండిగా ఉన్నాయా? ప‌్ర‌జ‌ల్లో మంచి పేరు ఉందా? ఇంకెందుకు ఆల‌స్యం?  వెంట‌నే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే.. 2019లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే! మీ సుడి బాగుంటే మీరే సీఎం అవ‌చ్చు. మ‌రో విషయం ఇది జాతీయ పార్టీ… ఎంపీగా గెలిస్తే..  మ‌రీ సుడిబాగుంటే…. కేంద్ర మంత్రి  కూడా కావ‌చ్చు! ఇంత‌కీ ఇదంతా […]

రండి బాబు.. రండీ..! గెలుపు గుర్రాలు కావ‌లెను!
X
మీరు ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలా? మీకు మీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచే స‌త్తా ఉందా? అంగ బ‌లం, అర్థ‌బ‌లం దండిగా ఉన్నాయా? ప‌్ర‌జ‌ల్లో మంచి పేరు ఉందా? ఇంకెందుకు ఆల‌స్యం? వెంట‌నే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే.. 2019లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే! మీ సుడి బాగుంటే మీరే సీఎం అవ‌చ్చు. మ‌రో విషయం ఇది జాతీయ పార్టీ… ఎంపీగా గెలిస్తే.. మ‌రీ సుడిబాగుంటే…. కేంద్ర మంత్రి కూడా కావ‌చ్చు! ఇంత‌కీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటున్నారా?
బీజేపీ పార్టీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌గ‌లిగే స‌త్తా ఉన్న గెలుపు గుర్రాల కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది. అదేనండీ.. గెల‌వ‌గ‌లిగే స‌త్తా ఉన్న నాయ‌కుల‌న్న మాట‌! 2019ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఒంటరిగానే తెలంగాణ‌లో అధికారం లోకి రావాల‌ని క‌మ‌ల‌నాథులు కంక‌ణం క‌ట్టుకున్నారు క‌దా! అందులో భాగంగానే ఈ నోటిఫికేష‌న్ జారీ చేశారు. త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌లిగే అభ్య‌ర్థ‌ల కోసం అన్వేష‌ణ మొద‌లు పెట్టారు. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది ఎవ‌రో కాదు. స్వ‌యంగా తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కె.లక్ష్మ‌ణ్ కావ‌డం విశేషం.
అయితే, క‌మ‌ల‌నాథులు ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌పుడు ప్ర‌జ‌ల‌కు ఏమ‌ని చెబుతారు?అన‌్న‌ది ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియా, ఎల‌క్ర్టానిక్, ప్రింట్ మీడియాలో ఎక్క‌డ చూసినా తెలంగాణ‌కు బీజేపీ చేసిందేం లేదు అన్న చ‌ర్చ తీవ్రంగా జ‌రుగుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల విష‌యంలో బీజేపీ నేత‌లు చెబుతున్న‌వ‌న్నీ వాస్త‌వ‌దూరంగా ఉన్నాయని ఇటీవ‌ల ఆర్థిక శాఖ మంత్రి ఈటెల క‌డిగిపారేశారు. మ‌రి మీకు మేం ఏం చేశాం? అని జ‌నాల‌కు చెబుతారో? ఈ విష‌యంలో క‌మ‌ల‌నాథుల వ్యూహం ఎలా ఉండ‌బోతోందో? అంతుబ‌ట్ట‌డం లేదు.
First Published:  13 July 2016 9:00 PM GMT
Next Story