ఎంజీఆర్‌ కుమార్తెకు జీవిత ఖైదు

అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కు పిల్లలు లేరు. ఇద్దరు అమ్మాయిలను పెంచుకున్నాడు. వాళ్లల్లో ఒక  పెంపుడు కుమార్తె భానుకు ఇప్పుడు జైలు శిక్ష పడింది. ఎంజీఆర్‌ మరో కుమార్తె సుధ భర్త విజయన్‌ హత్య కేసులో ఎంజీఆర్‌ పెంపుడు కుమార్తె భానుతో పాటు మరో ఆరుగురికి చెన్నై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఎంజీఆర్‌కు పెంపుడు కుమార్తె అయిన సుధ భర్త విజయన్‌ను 2008 జూన్‌లో కొందరు దారుణంగా హత్య చేశారు. విజయన్‌ను కారుతో ఢీకొట్టి అనంతరం ఇనుపరాడ్లతో మోది చంపేశారు. స్థానిక పోలీసులు తొలుత కేసు విచారణ చేపట్టారు.అనంతరం సీఐడీకి అప్పగించారు. విచారణలో కరుణ అనే కానిస్టేబుల్ సాయంతో సోదరి భర్తను భాను  హత్య చేయించినట్టు తేలింది. కేసులో దాదాపు 70 మంది సాక్ష్యులను విచారించిన న్యాయస్థానం చివరకు తీర్పు వెల్లడించింది. భానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఎంజీఆర్‌ కుమార్తెకు జైలు శిక్ష పడడం తమిళనాడులో సంచలన వార్తగా మారింది. తీర్పుపై బాధితురాలైన సుధ హర్షం వ్యక్తం చేశారు. తన భర్త ఆత్మకు ఇప్పటికి శాంతి కలిగిందన్నారు.

Click on Image to Read –

sabbam-hari

r-vidyasagar-rao

ysrcp1

Parthasarathy

sonia-gandhi

kejriwal1

chevi-reddy

babu-movie

ys-jagan-yatra

buggana-rajendranath-reddy

chandrababu-naidu

chandrababu-psyco

vijaya-sai-reddy

buggana-rajendranath-reddy

sujay-krishna-ranga-rao

babu-rank

ys-jagan

Palle-Raghunatha-Reddy

jagan-gottipati