సమంత, చైతూ పెళ్లికి ముహూర్తం ఫిక్స్

నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే విషయం పాతదే. వాళ్ల ప్రేమకు రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒప్పుకున్నారనే విషయం కూడా పాతదే. అయితే వాళ్ల పెళ్లికి తాజాగా డేట్ ఫిక్స్ అయిందనేది మాత్రం ఖాస్ ఖబర్. పెళ్లికి ముందు జరగాల్సిన నిశ్చితార్థాన్ని సెప్టెంబర్ లో పెట్టుకోవాలని రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు భావిస్తున్నారట. 
ప్రస్తుతం  నాగచైతన్య ప్రేమమ్ అనే సినిమా చేస్తున్నాడు. అటు సమంత కూడా జనతా గ్యారేజీ సినిమాతో బిజీగా ఉంది. ఈరెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చి… ఇద్దరూ ఫ్రీ అయ్యేసరికి సెప్టెంబర్ రెండోవారం పడుతుంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ పెట్టుకోవాలని బేసిక్ గా భావిస్తున్నారు. 
ప్రస్తుతం సమంత సినిమాలకు దాదాపు బై చెప్పేసింది. జనతా గ్యారేజ్ మూవీనే ఆమెకు చివరి సినిమా కావొచ్చు. పెళ్లి తర్వాత ఇక కెమెరా ముందురు రాకూడదనే నాగార్జున కండిషన్ కు సమంత ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే జనతా గ్యారేజ్ తర్వాత చేయాల్సిన సినిమాలన్నింటినీ ఆమె రద్దుచేసుకుంది.