Telugu Global
National

మోదీ భంగ‌ప‌డ్డారు... చంద్రుల ప‌రిస్థితి ఏంటి?

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌కీయ సంక్షోభం ముగిసింది. స్థానిక‌ గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. వాటిని రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌క‌టించింది. అక్క‌డ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచేందుకు జ‌రిగిన కుట్ర‌ల‌ను ఎండ‌గ‌ట్టింది. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్నే నెల‌కొల్పాల‌ని సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ నేత‌లు దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. త‌మ ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌పరించేందుకు ప్ర‌య‌త్నించిన బీజేపీకి ఇది చెంప‌పెట్టులాంటి తీర్పుగా అభిర్ణిస్తున్నారు. చివ‌రికి న్యాయ‌మే గెలిచింద‌ని సోనియా, రాహుల్ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిచండంలో కేంద్ర‌మేకాదు.. […]

మోదీ భంగ‌ప‌డ్డారు... చంద్రుల ప‌రిస్థితి ఏంటి?
X
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాజ‌కీయ సంక్షోభం ముగిసింది. స్థానిక‌ గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను సుప్రీం త‌ప్పుబ‌ట్టింది. వాటిని రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌క‌టించింది. అక్క‌డ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచేందుకు జ‌రిగిన కుట్ర‌ల‌ను ఎండ‌గ‌ట్టింది. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్నే నెల‌కొల్పాల‌ని సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ నేత‌లు దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. త‌మ ప్ర‌భుత్వాల‌ను అస్థిర‌పరించేందుకు ప్ర‌య‌త్నించిన బీజేపీకి ఇది చెంప‌పెట్టులాంటి తీర్పుగా అభిర్ణిస్తున్నారు. చివ‌రికి న్యాయ‌మే గెలిచింద‌ని సోనియా, రాహుల్ వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిచండంలో కేంద్ర‌మేకాదు.. తెలుగు రాష్ర్టాల సీఎంలు ఏమీ త‌క్కువ తిన‌లేదు. తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల నుంచి సీఎం కేసీఆర్ పార్టీలో చేరిన వారి సంఖ్య 47. ఏపీలోనూ ఈ సంఖ్య 20 కి అటూఇటూగా ఉంది. ఈ ప‌రిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు, బాబుపై వైఎస్సార్ సీపీ నేత‌లు సుప్రీంను ఆశ్ర‌యించారు. ఇప్ప‌టికే ఉత్త‌రాఖండ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ వ్య‌వ‌హారంలో సుప్రీం కోర్టు ప్ర‌జ‌లు ఎన్నుకున్న కాంగ్రెస్ స‌ర్కారుల‌నే పున‌రుద్ధ‌రించింది. ఇప్పుడు అదే న‌మ్మ‌కంతో పార్టీ ఫిరాయించిన వారిపై క‌నీసం వేటైనా ప‌డుతుంద‌ని రెండు రాష్ర్టాల ప్ర‌తిప‌క్షాలు ఆశిస్తున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఫిరాయింపులు కొత్త కాకున్నా.. ఇవి ఏమాత్రం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కాదు. అధికార పార్టీ చేస్తోంది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం అని గొంతు చించుకుంటున్న ఏపార్టీ కూడా ఈ విష‌యంలో ఒకేమాట‌పై ఉన్న‌ట్లు లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల‌ను కూల‌దోసింది..అప్పుడు ఈ వ్య‌వ‌హారాన్ని వ్య‌తిరేకించిన బీజేపీ… ఇప్పుడు అదే ప‌ని చేస్తోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీ కాంగ్రెస్ ఎగ‌రేసుకుపోతుంద‌ని గొంతు చించుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబులూ ఇప్పుడు అదే నీతిని అనుస‌రిస్తున్నారు. ఏది న్యాయం? ఎక్క‌డ ఉంది న్యాయం? అధికారం కోసం సాగుతున్న కుర్చీలాట‌లో మెజారిటీ పార్టీలు రాజ‌కీయ విలువ‌ల‌కు ఏనాడో మంగ‌ళం పాడేశాయి. రేపు సుప్రీంలో ఈవిష‌యంలో తెలుగు చంద్రుల‌కు మొట్టికాయ‌లు ప‌డితే.. ప‌రిస్థితి ఏంటి? అన్న విషయం ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది.
First Published:  13 July 2016 9:09 PM GMT
Next Story