Telugu Global
NEWS

మంత్రి కేటీఆర్ త‌న జీతాన్ని ఏం చేశారో తెలుసా?

హ‌రిత హారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం వినూత్నంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. సీఎం ఆదేశాల మేర‌కు మంత్రులంద‌రూ త‌మ శాఖ‌ల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా అమ‌లుచేసే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ త‌న శాఖ‌లోనూ ఈ నెల 18న హ‌రిత‌హారంను చేప‌ట్ట‌నున్నారు. ఇందుకోసం చెట్టు-బొట్టుపేరుతో అన్ని కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో ఈ కార్య‌క్ర‌మం చేపట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌ను విడుద‌ల చేయనుంది. అయితే, కార్యక్ర‌మం ఆశించిన‌దానికంటే ఎక్కువ‌గా […]

మంత్రి కేటీఆర్ త‌న జీతాన్ని ఏం చేశారో తెలుసా?
X
హ‌రిత హారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం వినూత్నంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. సీఎం ఆదేశాల మేర‌కు మంత్రులంద‌రూ త‌మ శాఖ‌ల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా అమ‌లుచేసే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ త‌న శాఖ‌లోనూ ఈ నెల 18న హ‌రిత‌హారంను చేప‌ట్ట‌నున్నారు. ఇందుకోసం చెట్టు-బొట్టుపేరుతో అన్ని కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల్లో ఈ కార్య‌క్ర‌మం చేపట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌ను విడుద‌ల చేయనుంది. అయితే, కార్యక్ర‌మం ఆశించిన‌దానికంటే ఎక్కువ‌గా విజ‌య‌వంతం అయ్యేందుకు మంత్రి కేటీఆర్ ఒక ఆలోచ‌న చేశారు.
చెట్టు-బొట్టు కార్య‌క్ర‌మానికి విరాళంగా త‌న ఒక నెల వేత‌నాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మంత్రితోపాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ మేయ‌ర్లంతా త‌మ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వ‌నున్నారు. మునిసిప‌ల్ శాఖ‌లోని ఉద్యోగులంతా త‌మ ఒక‌రోజు వేత‌నాన్ని ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చారు. అంద‌రి వేత‌నాలను విరాళంగా ఇవ్వ‌డం వ‌ల్ల మొక్క‌ల సంర‌క్ష‌ణ‌పై అంద‌రికీ స‌మాన బాధ్య‌త వ‌హిస్తుంద‌న్న‌ది కేటీఆర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. ఇంత‌కీ కేటీఆర్ ఇచ్చిన ఒక‌నెల వేత‌నం ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.2.5 ల‌క్ష‌లు. ఇటీవ‌ల తెలంగాణ ఎమ్మెల్యేల వేత‌నాలు భారీగా పెరిగాయి క‌దా! ఇందులో మంత్రిగా ఆయ‌న అల‌వెన్సులు ఇంకాస్త ఎక్కువే!
First Published:  15 July 2016 10:08 PM GMT
Next Story