Telugu Global
Cinema & Entertainment

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రజనీ వచ్చేస్తున్నాడు...

రజనీకాంత్ ప్రమేయం లేకుండానే కబాలి సినిమా విడుదలవుతోంది.  సూపర్ స్టార్ లేకుండానే ఈ సినిమాకు ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది. కబాలి సినిమాకు సంబంధించి రజనీకాంత్ ఇప్పటివరకు కనిపించలేదు. ఓవైపు తమ అభిమాన నాయకుడికి ఏమైందంటూ బెంగపెట్టుకుంటూనే.. మరోవైపు కబాలిని హిట్ చేసేందుకు అశేష తలైవ గణం సిద్ధమైంది. తమిళనాట అంతా థియేటర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదిలా ఉండగా… అభిమానుల మనసులో గూడుకట్టుకున్న భయాన్ని, టెన్షన్ ను పొగొట్టే వార్త ఒకటి తాజాగా వచ్చింది. అవును… […]

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రజనీ వచ్చేస్తున్నాడు...
X

రజనీకాంత్ ప్రమేయం లేకుండానే కబాలి సినిమా విడుదలవుతోంది. సూపర్ స్టార్ లేకుండానే ఈ సినిమాకు ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది. కబాలి సినిమాకు సంబంధించి రజనీకాంత్ ఇప్పటివరకు కనిపించలేదు. ఓవైపు తమ అభిమాన నాయకుడికి ఏమైందంటూ బెంగపెట్టుకుంటూనే.. మరోవైపు కబాలిని హిట్ చేసేందుకు అశేష తలైవ గణం సిద్ధమైంది. తమిళనాట అంతా థియేటర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదిలా ఉండగా… అభిమానుల మనసులో గూడుకట్టుకున్న భయాన్ని, టెన్షన్ ను పొగొట్టే వార్త ఒకటి తాజాగా వచ్చింది. అవును… రజనీకాంత్ స్వదేశానికి వచ్చేస్తున్నాడు. అది కూడా కబాలి విడుదలకు ముందే రజనీ చెన్నైలో ల్యాండ్ అవుతాడు.

కబాలి సినిమా ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అంతకంటే 2 రోజుల ముందే రజనీకాంత్ చెన్నై చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెరికాలో చికిత్స పొందుతున్నట్టు రజనీకాంత్ పై వార్తలు వస్తున్నాయి. ఇందులో 90శాతం నిజం ఉందని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాబట్టి… చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని, చెన్నై వచ్చేందుకు రజనీకాంత్ సిద్ధమౌతున్నారని తెలుస్తోంది. కబాలి విడుదలకు ముందు ఒక్కసారైనా అభిమానులను పలకరించాలని రజనీకాంత్ అనుకుంటున్నారట. అందుకే ఇంకొన్నాళ్లు అమెరికాలో ఉండాల్సి వస్తున్నప్పటికీ… సినిమా విడుదలకు ముందే చెన్నై వస్తాడని అంటున్నారు.

First Published:  16 July 2016 9:05 AM GMT
Next Story