Telugu Global
NEWS

బాబు కోసం జాబ్‌ వదులుకున్నా... నెత్తిన ఫిరాయింపు ఎమ్మెల్యేను పెట్టారు

వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చోట టీడీపీలో వర్గవిబేధాలు పదేపదేరచ్చకెక్కుతున్నాయి. తాజాగా కడప జిల్లా బద్వేల్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టీడీపీ బద్వేల్ ఇన్‌చార్జ్‌ విజయజ్యోతి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పార్టీతీరుపై నిప్పులు చెరిగారు. తన అవసరం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అవసరం పార్టీకి లేదనుకుంటే నేరుగా చెప్పాలని అంతేగానీ అవమానించడం సరికాదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తనను నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించడం లేదని ఆగ్రహం […]

బాబు కోసం జాబ్‌ వదులుకున్నా... నెత్తిన ఫిరాయింపు ఎమ్మెల్యేను పెట్టారు
X

వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చోట టీడీపీలో వర్గవిబేధాలు పదేపదేరచ్చకెక్కుతున్నాయి. తాజాగా కడప జిల్లా బద్వేల్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టీడీపీ బద్వేల్ ఇన్‌చార్జ్‌ విజయజ్యోతి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పార్టీతీరుపై నిప్పులు చెరిగారు. తన అవసరం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అవసరం పార్టీకి లేదనుకుంటే నేరుగా చెప్పాలని అంతేగానీ అవమానించడం సరికాదన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తనను నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా ఆహ్వానించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారామె. చంద్రబాబుకు మద్దతుగా నిలబడాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి వచ్చానని చెప్పారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే జయరాములును పార్టీలోకి తెచ్చి తనను పక్కన పెట్టారని ఆమె ఆవేదన చెందారు. జిల్లా అధ్యక్షుడే పనిగట్టుకుని నియోజకవర్గాల్లో గ్రూపులను పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు విజయలక్ష్మి. ఒకవేళ తనను పార్టీ నుంచి వెలివేసి ఉంటే ఆ విషయం ధైర్యంగా బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే జయరాములును పార్టీలోకి తెచ్చిన తర్వాత బద్వేల్‌లో గ్రూపులు తయారయ్యాయి. కొన్ని రోజుల క్రితం జిల్లా అధ్యక్షుడు సమీక్ష సమావేశం నిర్వహించగా బద్వేల్ టీడీపీకార్యకర్తలు ఎదురుతిరిగారు. ఆ సమయంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా… బద్వేల్ నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తావో చూస్తామంటూ జిల్లా అధ్యక్షుడికే కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ నిప్పులు చెరిగారు.

Click on Image to Read:

gali-muddu-krishnama-naidu

katti-padmarao-new

srivani

eenadu-story

babu-lokesh

11212

ambati

chandrababu-modi

ysrcp1

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie

First Published:  15 July 2016 10:16 PM GMT
Next Story