Telugu Global
NEWS

అస‌ద్ అరెస్టు ఖాయం?

ఎంపీ అస‌ద్‌కు క్ర‌మంగా చిక్కులు పెరుగుతున్నాయి. ఐసీస్ సానుభూతిప‌రులుగా ఎన్ ఐ ఏ అరెస్టు చేసిన నిందితుల‌కు న్యాయ‌సాయం చేస్తాన‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న అస‌ద్‌ను మ‌రింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. మొన్న హైద‌రాబాద్‌లోని సరూర్‌న‌గ‌ర్ కోర్టు ఆయ‌న అరెస్టుకు ఆదేశాలు జారీ చేయ‌గా.. తాజాగా క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదైంది.  క‌రీంన‌గ‌ర్‌కు చెందిన భేతి మ‌హేంద‌ర్ రెడ్డి అనే న్యాయ‌వాది అస‌ద్‌పై వ్యాఖ్య‌ల‌పై పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఉగ్ర‌వాద సానుభూతి ప‌రుల‌కు న్యాయ‌సాయమంటే..దేశ‌ద్రోహమేన‌ని వాదించారు. […]

ఎంపీ అస‌ద్‌కు క్ర‌మంగా చిక్కులు పెరుగుతున్నాయి. ఐసీస్ సానుభూతిప‌రులుగా ఎన్ ఐ ఏ అరెస్టు చేసిన నిందితుల‌కు న్యాయ‌సాయం చేస్తాన‌ని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న అస‌ద్‌ను మ‌రింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. మొన్న హైద‌రాబాద్‌లోని సరూర్‌న‌గ‌ర్ కోర్టు ఆయ‌న అరెస్టుకు ఆదేశాలు జారీ చేయ‌గా.. తాజాగా క‌రీంన‌గ‌ర్ లో ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదైంది.
క‌రీంన‌గ‌ర్‌కు చెందిన భేతి మ‌హేంద‌ర్ రెడ్డి అనే న్యాయ‌వాది అస‌ద్‌పై వ్యాఖ్య‌ల‌పై పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఉగ్ర‌వాద సానుభూతి ప‌రుల‌కు న్యాయ‌సాయమంటే..దేశ‌ద్రోహమేన‌ని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు అసద్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేయాల‌ని క‌రీంన‌గ‌ర్ రెండో ఠాణా పోలీసుల‌ను ఆదేశించింది. ఈమేర‌కు ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.
గ‌తంలో అస‌ద్ త‌మ్ముడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌ర్ పైనా దేశ‌ద్రోహం కేసులు న‌మోద‌య్యాయి. విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఉమ్మ‌డి ఏపీలోని కాంగ్రెస్ స‌ర్కారు హ‌యాంలో అక్బ‌ర్‌పై ప‌లు చోట్ల కేసులు న‌మోద‌య్యాయి. అప్ప‌టికే అనారోగ్యంతో ఉన్న అక్బ‌ర్ కేసుల కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వ‌చ్చింది. తాజాగా అసద్‌కు ఇవే చిక్కులు ఎదుర‌వుతుండటంతో ఆయ‌న అరెస్టు అవుతార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. అయితే, అక్బ‌ర్ ఎమ్మెల్యే కాబ‌ట్టి అనుమ‌తులు సులువుగా వ‌చ్చాయ‌ని, అస‌ద్ ఎంపీ కాబ‌ట్టి అరెస్టు అయ్యే అవ‌కాశాలు త‌క్క‌వేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. పైగా అస‌ద్ విద్వేష‌పూరితంగా ప్ర‌సంగించ‌లేదు.. గ‌తంలో ఇలా ముద్ర‌ప‌డ్డ‌వారిలో చాలామంది నిర్దోషులుగా బ‌య‌టికి వ‌చ్చిన వారి ఉదంతాల‌ను ప్ర‌స్తావిస్తూనే.. అమాయ‌కులైతే న్యాయ‌సాయం చేస్తామ‌న్నారని గుర్తు చేస్తున్నారు. లండ‌న్‌లో బారిష్ట‌రు చ‌దివిన అస‌ద్ అంత తేలిగ్గా చిక్క‌రు అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.
First Published:  16 July 2016 9:00 PM GMT
Next Story