Telugu Global
Cinema & Entertainment

అనుష్కకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి 2’ క్లైమాక్స్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ బాహుబలి కంక్లూజన్ ఔట్ ఫుట్ పై రాజమౌళి సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ విషయంలో మాత్రం రాజమౌళి సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఆ స్టోరీలోకి వెళితే, బాహుబలి తొలి భాగంలో ‘దేవసేన’ గా అనుష్క కేవలం ఓల్డేజ్ గెటప్ లో మాత్రమే కనిపించింది. కానీ, […]

అనుష్కకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి
X
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి 2’ క్లైమాక్స్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ బాహుబలి కంక్లూజన్ ఔట్ ఫుట్ పై రాజమౌళి సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ విషయంలో మాత్రం రాజమౌళి సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఆ స్టోరీలోకి వెళితే, బాహుబలి తొలి భాగంలో ‘దేవసేన’ గా అనుష్క కేవలం ఓల్డేజ్ గెటప్ లో మాత్రమే కనిపించింది. కానీ, ‘బాహుబలి 2’ లో మాత్రం అనుష్క రోల్ చాలా కీలకం. ముఖ్యంగా బాహుబలి ప్రియురాలిగా, భల్లాలదేవుడు ఆశపడే అమ్మాయిగా, అందాల రాణిగా దేవసేన అలరించనుంది.
అయితే, ఇప్పుడు దేవసేనకు సంబంధించిన సీన్స్ తెరకెక్కించడానికి అనుష్క సైజ్ సెట్ కావడం లేదని ప్రచారం జరుగుతుంది. ‘సైజ్‌ జీరో’ అంటూ అక్కర్లేని ప్రయోగాలు చేసి చిక్కుల్లో పడింది అనుష్క. అప్పుడు పెరిగిన బరువు ఇప్పటికీ తగ్గకపోవడంతో రాజమౌళి ఆమెకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడట.అందులోనూ అనుష్క లైపోసక్షన్ లాంటి అసహజ పద్ధతుల ద్వారా కాకుండా కేవలం నేచురల్ గానే బరువు తగ్గాలని డిసైడ్ అవడంతో సైజ్ తగ్గే విషయంలో ఆలస్యం అవుతుందని సమాచారం.
First Published:  17 July 2016 7:25 AM GMT
Next Story