Telugu Global
NEWS

కేసీఆర్‌కు జ్వ‌రం.. ప్ర‌ధానితో స‌మావేశ‌మ‌వుతారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన ప‌లు కీల‌క విష‌యాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. అయితే, ఆదివారం నుంచి కేసీఆర్ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి స‌మావేశం జ‌రుగుతుందా?  లేదా ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ నిర్వ‌హించిన స‌ర్వేలో కేసీఆర్‌కు మొద‌టి ర్యాంకు వ‌చ్చింద‌ని వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో వీరిభేటీకి ప్రాధాన్యం సంత‌రించుకుంది. కానీ గ‌త […]

కేసీఆర్‌కు జ్వ‌రం.. ప్ర‌ధానితో స‌మావేశ‌మ‌వుతారా?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్ర‌ధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన ప‌లు కీల‌క విష‌యాల‌పై వీరిద్ద‌రూ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. అయితే, ఆదివారం నుంచి కేసీఆర్ తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వీరి స‌మావేశం జ‌రుగుతుందా? లేదా ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ నిర్వ‌హించిన స‌ర్వేలో కేసీఆర్‌కు మొద‌టి ర్యాంకు వ‌చ్చింద‌ని వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో వీరిభేటీకి ప్రాధాన్యం సంత‌రించుకుంది. కానీ గ‌త రెండు రోజులుగా తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న కేసీఆర్ ఈ స‌మావేశానికి హాజ‌రు కాగలుగుతారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
రాష్ట్ర విభ‌జన జ‌రిగి రెండేళ్ల‌వుతున్నా.. కీల‌క‌మైన స‌మ‌స్య‌లు ఇంకా అలాగే ఉండిపోయాయి. హైకోర్టు విభ‌జ‌న‌, ఉద్యోగుల పంప‌కాలు, నదీ జ‌లాల వివాదం, క్రిష్ణా యాజ‌మాన్య బోర్డు వివాదం, హైకోర్టులో ఇటీవ‌ల జ‌రిగిన నియామ‌కాలు, దానికి నిర‌స‌న‌గా చేప‌ట్టిన ఆందోళ‌న‌లు, ప‌లువురు న్యాయాధికారుల సస్పెన్ష‌న్ విష‌యాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగనుంది. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌లు ప‌థ‌కాల‌కు కేంద్రం నుంచి ఇంకా నిధులు విడుద‌ల కావాల్సి ఉంది. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాల‌ను ఇటీవ‌ల నీతి అయోగ్ అభినందించిన విష‌యం తెలిసిందే! వీటికి నిధులు విడుద‌ల చేయాల‌ని ప్ర‌ధానిని కేసీఆర్ కోర‌నున్నారు.
ప్ర‌ధానితో భేటీ ముగిసిన త‌రువాత కేసీఆర్‌.. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమాభార‌తితోనూ స‌మావేశం కానున్నారు. ఏపీ, తెలంగాణ మ‌ధ్య నెల‌కొన్న న‌దీ జ‌లాల‌ వివాదాలను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని కోరనున్నారు. కానీ, తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న కేసీఆర్ ఈ రెండు స‌మావేశాల‌కు హాజ‌రుకాగ‌ల‌రా? అన్న‌ది ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితిపై నే ఆధార‌ప‌డి ఉంటుంది. ఎందుకంటే.. శ‌నివారం అంత‌రాష్ర్టాల మండ‌లి స‌మావేశం నుంచి ఆయ‌న అర్ధాంత‌రంగా వెళ్లిపోయారు. ఆదివారం కేంద్ర అట‌వీశాఖ మంత్రి అనిల్ మాధ‌వ్‌తోనూ కేసీఆర్ త‌న స‌మావేశాన్ని ర‌ద్దు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానితో స‌మావేశం ఎలా సాగుతుంద‌న్న విష‌యంపై గులాబీ నేత‌లు ఆందోళ‌న‌గా ఉన్నారు.
First Published:  17 July 2016 10:15 PM GMT
Next Story