Telugu Global
NEWS

నాసిరకం పాలన... హంద్రీనీవాలోనూ పగుళ్లు

రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏ పని చేసినా అది చివరకు నాసిరకమేనని తేలుతోంది. ప్రతిష్టాత్మక సచివాలయంలో ఫ్లోర్ కూలింది. మరోసారి సైడ్ వాల్ కూలింది. పుష్కరాల్లో ప్రధానమైన విజయవాడ దుర్గా ఘాట్‌లో కాంక్రీట్ దిమ్మే అడ్డంగా చీలిపోయింది. పట్టిసీమ తొలి ప్రారంభోత్సవ సమయంలో నీరు విడుదల చేయగానే ఏకంగా నీరు వెళ్లే బిడ్జే కూలిపోయింది. ఇప్పుడు రాయలసీమకు ప్రధానమైన హంద్రీనీవా సుజల స్రవంతిలోనూ డొల్లతనం బయటపడింది. హంద్రీనీవాలో పలుచోట్ల కాంక్రీట్‌ పనుల్లో భారీగా పగుళ్లు వచ్చాయి.  కడప […]

నాసిరకం పాలన... హంద్రీనీవాలోనూ పగుళ్లు
X

రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఏ పని చేసినా అది చివరకు నాసిరకమేనని తేలుతోంది. ప్రతిష్టాత్మక సచివాలయంలో ఫ్లోర్ కూలింది. మరోసారి సైడ్ వాల్ కూలింది. పుష్కరాల్లో ప్రధానమైన విజయవాడ దుర్గా ఘాట్‌లో కాంక్రీట్ దిమ్మే అడ్డంగా చీలిపోయింది. పట్టిసీమ తొలి ప్రారంభోత్సవ సమయంలో నీరు విడుదల చేయగానే ఏకంగా నీరు వెళ్లే బిడ్జే కూలిపోయింది. ఇప్పుడు రాయలసీమకు ప్రధానమైన హంద్రీనీవా సుజల స్రవంతిలోనూ డొల్లతనం బయటపడింది. హంద్రీనీవాలో పలుచోట్ల కాంక్రీట్‌ పనుల్లో భారీగా పగుళ్లు వచ్చాయి.

2కడప జిల్లా చెన్నమండెం మండల పరిధిలో కోట్లాది రూపాయలతో ప్రధాన కాల్వ పనులు జరుగుతున్నాయి. బెస్తపల్లె సమీపంలో ఎస్‌ఎల్‌వీ, సైఫన్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణంలో అప్పుడే కాంక్రీట్ నిర్మాణాలు పగుళ్లు కొట్టేశాయి. దూరం నుంచి కూడా ఈ పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయం అటుగా వెళ్లిన వారందరికీ అర్థమవుతుండడంతో కాంట్రాక్టర్‌ పైపైన సిమెంట్ పూత పూశారు. అయితే పగుళ్లు రానురాను పెద్దవిగా మారుతుండడంతో పైన పూసిన పూత కూడా బండారాన్ని కప్పిపుచ్చలేకపోతోంది.

1చిన్నమండెం మార్గంలో బ్రిడ్జి వద్ద కూడా కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. గతంలో కురిసిన వర్షాలకు ఈ లైనింగ్ పూర్తిగా పడిపోయింది. మొత్తం మీద హంద్రీనీవాలో అడుగడుగున నాసిరకంగా పనులు సాగుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి పనులు సబ్‌ కాంట్రాక్టర్లకు మారడం వల్లే ఇలా పనుల నాణ్యతలో జవాబుదారీతనం లేకుండాపోయిందంటున్నారు.

Click on Image to Read:

roja

jairam-ramesh

pattipati-pullarao

kcr

kovur-tdp-mla-polam-reddy-s

sharma

jv-ramudu

galla-arjun-jayadev

tdp-vijaya-jyothi

vijayawada-flyover

babu-movie

First Published:  17 July 2016 10:16 PM GMT
Next Story