Telugu Global
NEWS

టీఆర్ ఎస్‌లో చేరాల‌ని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు

త‌మ నాయ‌కుల‌ను పార్టీ మారాలంటూ పోలీసుల చేత అధికార పార్టీ ఒత్తిడి చేయించ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టే ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని అధికార పార్టీకి  సూచించారు. నాయ‌కుల‌ను బెదిరించేందుకు అధికార పార్టీ పోలీసుల‌ను వాడుకోవడం స‌మంజ‌సం కాద‌ని ఆరోపిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని చింత‌కాని మండ‌లం రామ‌కృష్ణాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడి ఇంటికి ఏసీబీ పోలీసులు వెళ్లార‌ని భ‌ట్టి ఆరోపించారు. వారు అధికార పార్టీలోకి మారాల‌ని ఒత్తిడి […]

టీఆర్ ఎస్‌లో చేరాల‌ని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు
X
త‌మ నాయ‌కుల‌ను పార్టీ మారాలంటూ పోలీసుల చేత అధికార పార్టీ ఒత్తిడి చేయించ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఇబ్బందులు పెట్టే ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని అధికార పార్టీకి సూచించారు. నాయ‌కుల‌ను బెదిరించేందుకు అధికార పార్టీ పోలీసుల‌ను వాడుకోవడం స‌మంజ‌సం కాద‌ని ఆరోపిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలోని చింత‌కాని మండ‌లం రామ‌కృష్ణాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడి ఇంటికి ఏసీబీ పోలీసులు వెళ్లార‌ని భ‌ట్టి ఆరోపించారు. వారు అధికార పార్టీలోకి మారాల‌ని ఒత్తిడి చేశార‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో పోలీసుల‌కు కూడా ప‌లు సూచ‌న‌లు చేశారు భ‌ట్టి. పార్టీలు అధికారంలోకి వ‌స్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, పోలీసులు నిబ‌ద్ద‌తో వృత్తి ధ‌ర్మం నెర‌వేర్చాల‌ని సూచించారు. అంతేకానీ, అధికార‌పార్టీల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క‌ అర్థంలేని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఒక గ్రామ‌స్థాయి నాయ‌కుడిని పోలీసుల చేత బెదిరించి పార్టీ మార్పించాల్సిన అగ‌త్యం త‌మ‌కు ప‌ట్ట‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయినా.. ఏసీబీ పోలీసులు విచార‌ణ‌లో భాగంగా ఎవ‌రి ఇంటికీ వెళ్ల‌కూడ‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌లో పోలీసులు నిస్ప‌క్ష‌పాతంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. ఓటుకు నోటు స‌మ‌యంలో నిందితుల‌తో ఎంత ప‌ద్ధ‌తిగా వ్య‌వ‌హ‌రించారో లోకమంతా చూశార‌ని గుర్తుచేస్తున్నారు. త‌మ నాయ‌కుడు చేస్తోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చూసి మాపార్టీలో చేరుతున్నారే త‌ప్ప‌.. ఎవ‌రినీ బెదిరించాల్సిన అగ‌త్యం త‌మ‌కు ప‌ట్ట‌లేద‌న్నారు.
First Published:  17 July 2016 8:01 PM GMT
Next Story