Telugu Global
Cinema & Entertainment

భారీ స్థాయిలో విడుదలకానున్న కబాలి

ఈ వీకెండ్ ఇండియాలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ప్రధానంగా కబాలిపైనే ఉంది. కబాలి మేనియా ఆలిండియా వ్యాపించేసింది. క్రేజ్ కు హిట్స్ తో పనిలేదని నిరూపించింది కబాలి సినిమా. రజనీ నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ… కబాలిపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. రజనీ మేనియా చెక్కుచెదరలేదు. దీనికి తగ్గట్టే తెలంగాణలో కబాలి సినిమాను రికార్డు స్థాయిలో విడుదల చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణలో కబాలి సినిమా హక్కుల్ని అభిషేక్ […]

భారీ స్థాయిలో విడుదలకానున్న కబాలి
X
ఈ వీకెండ్ ఇండియాలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం ప్రధానంగా కబాలిపైనే ఉంది. కబాలి మేనియా ఆలిండియా వ్యాపించేసింది. క్రేజ్ కు హిట్స్ తో పనిలేదని నిరూపించింది కబాలి సినిమా. రజనీ నటించిన గత రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ… కబాలిపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. రజనీ మేనియా చెక్కుచెదరలేదు. దీనికి తగ్గట్టే తెలంగాణలో కబాలి సినిమాను రికార్డు స్థాయిలో విడుదల చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణలో కబాలి సినిమా హక్కుల్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. భారీ మొత్తానికి రైట్స్ కొనుగోలు చేసిన ఈ సంస్థ… నైజాంలో రికార్డు స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి 3వందల థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. నైజాంలో రజనీకాంత్ సినిమా ఈ స్థాయిలో విడుదలకానుండడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. విడుదల సమయానికి,.. అంటే శుక్రవారానికి థియేటర్లు ఇంకాస్త పెరిగే అవకాశాలున్నాయి.
కేవలం నైజాంలోనే కాదు… ఇండియా అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో రజనీ మేనియా పీక్స్ లో ఉంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో అత్యధిక స్క్రీన్స్ పై కబాలిని తెరపైకి తెస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అమెరికాలోని అన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ పూర్తయింది. కొన్ని హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇలా విడుదలకు ముందు బుకింగ్స్ క్లోజ్ అవుతాయి. కబాలి ఇప్పుడు హాలీవుడ్ జనాలనే ఆశ్చర్యపరుస్తోంది.
First Published:  19 July 2016 5:22 AM GMT
Next Story