Telugu Global
Health & Life Style

తాగుబోతు తండ్రులూ...మీ పిల్ల‌లు జాగ్ర‌త్త‌!

మ‌ద్యానికి బానిస‌లైన‌వారు త‌మ‌ని తామే సంర‌క్షించుకోలేని స్థితిలో ఉంటారు. వారు పిల్ల‌ల‌కు తాము భ‌ద్రంగా ఉన్నామ‌న్న ధైర్యాన్ని క‌ల్పించ‌లేరు. పైకి చెప్ప‌లేక‌పోయినా తండ్రులు తాగుతున్న‌పుడు వారి పిల్ల‌లు మాన‌సిక వేద‌న‌ని అనుభ‌విస్తారు. భ‌యం, అభ‌ద్ర‌త‌, కోపం, నిర్ల‌క్ష్యం లాంటి నెగెటివ్ ల‌క్ష‌ణాలు ఈ పిల్ల‌ల్లో ఇత‌ర పిల్ల‌ల కంటే ఎక్కువ‌గా చోటు చేసుకునే అవ‌కాశం  ఉంది.   బెథ్ ఇజ్రాయిల్ మెడిక‌ల్ సెంట‌ర్‌, అమెరికాలోని బోస్ట‌న్ పిల్ల‌ల వైద్య‌శాల‌ల ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్నే చెబుతున్నారు. త‌ల్లిదండ్రులు ఆల్క‌హాల్‌, […]

తాగుబోతు తండ్రులూ...మీ పిల్ల‌లు జాగ్ర‌త్త‌!
X

మ‌ద్యానికి బానిస‌లైన‌వారు త‌మ‌ని తామే సంర‌క్షించుకోలేని స్థితిలో ఉంటారు. వారు పిల్ల‌ల‌కు తాము భ‌ద్రంగా ఉన్నామ‌న్న ధైర్యాన్ని క‌ల్పించ‌లేరు. పైకి చెప్ప‌లేక‌పోయినా తండ్రులు తాగుతున్న‌పుడు వారి పిల్ల‌లు మాన‌సిక వేద‌న‌ని అనుభ‌విస్తారు. భ‌యం, అభ‌ద్ర‌త‌, కోపం, నిర్ల‌క్ష్యం లాంటి నెగెటివ్ ల‌క్ష‌ణాలు ఈ పిల్ల‌ల్లో ఇత‌ర పిల్ల‌ల కంటే ఎక్కువ‌గా చోటు చేసుకునే అవ‌కాశం ఉంది.

బెథ్ ఇజ్రాయిల్ మెడిక‌ల్ సెంట‌ర్‌, అమెరికాలోని బోస్ట‌న్ పిల్ల‌ల వైద్య‌శాల‌ల ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్నే చెబుతున్నారు. త‌ల్లిదండ్రులు ఆల్క‌హాల్‌, డ్ర‌గ్స్ సేవిస్తున్నా, లేదా వాటిని స‌ర‌ఫ‌రా చేసే వృత్తిలో ఉన్నా వారి పిల్ల‌లు శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటార‌ని, వారు ఇత‌ర పిల్ల‌ల కంటే నాలుగురెట్లు అధికంగా నిర్ల‌క్ష్యానికి గుర‌వుతార‌ని ఈ ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. వీరి ప్ర‌వ‌ర్త‌నలో కూడా లోపాలు ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒక వ్య‌క్తి మ‌ద్యానికి బానిస అయితే అత‌నితో పాటు అత‌ని త‌రువాత త‌రం కూడా ఎంత‌గా న‌ష్ట‌పోతుంద‌నే విష‌యాన్ని మ‌ద్య‌పాన ప్రియుల‌కు వైద్యులు చెప్పాల‌ని ఈ ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

First Published:  18 July 2016 10:54 PM GMT
Next Story