Telugu Global
Cinema & Entertainment

మహేష్... ఎన్టీఆర్... ఇద్దర్లో నైజాం కింగ్ ఎవరు..?

బాహుబలిని పక్కనపెడదాం. నైజాంలో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమా ఇదే. ఇది సాధించిన వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంది. కాబట్టి ఈ సినిమాను పక్కనపెడితే… హీరోల్లో నైజాం కింగ్ ఎవరనే ప్రశ్న తాజాగా చర్చకొచ్చింది. ప్రస్తుతం ఈ రేసులో మహేష్, ఎన్టీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో హీరోలు అదరగొట్టారు. కానీ మహేష్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. శ్రీమంతుడు సినిమా హిట్ తో మహేష్ […]

మహేష్... ఎన్టీఆర్... ఇద్దర్లో నైజాం కింగ్ ఎవరు..?
X
బాహుబలిని పక్కనపెడదాం. నైజాంలో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సినిమా ఇదే. ఇది సాధించిన వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంది. కాబట్టి ఈ సినిమాను పక్కనపెడితే… హీరోల్లో నైజాం కింగ్ ఎవరనే ప్రశ్న తాజాగా చర్చకొచ్చింది. ప్రస్తుతం ఈ రేసులో మహేష్, ఎన్టీఆర్ ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో హీరోలు అదరగొట్టారు. కానీ మహేష్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది.
శ్రీమంతుడు సినిమా హిట్ తో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే నైజాంలో రికార్డు ధరకు శ్రీమంతుడు సినిమా అమ్ముడుపోయింది. కానీ సినిమా విడుదలైన తర్వాత బయ్యర్లకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయి. అలా ప్రీ-రిలీజ్ లో అదరగొట్టిన మహేష్, థియేటర్ల ముందు మాత్రం తన షో చూపించలేకపోయాడు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ అందుకున్నాడు కాబట్టి.. ప్రస్తుతం తారక్ నటిస్తున్న జనతా గ్యారేజ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే జనతా గ్యారేజ్ నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.
తాజా సమాచారం ప్రకారం… జనతా గ్యారేజ్ నైజాం రైట్స్ 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఎమౌంట్ ఇది. నిర్మాత దిల్ రాజు ఈ రైట్స్ దక్కించుకున్నాడు. గతంలో ఇదే ప్రొడ్యూసర్ నాన్నకు ప్రేమతో సినిమా హక్కుల్ని 14 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. కానీ నాన్నకు ప్రేమతో సినిమాతో తనకు పెద్దగా లాభాలు రాలేదంటున్నాడు దిల్ రాజు. అయినప్పటికీ.. జనతా గ్యారేజ్ ను 17కోట్లకు కొనుగోలు చేశాడు. మరి ఈసారి ఎన్టీఆర్ తన తాజా చిత్రంతో వసూళ్ల వర్షం కురిపిస్తాడా.. థియేటర్లలో మహేష్ ను క్రాస్ చేస్తాడా అనేది చూడాలి.
First Published:  19 July 2016 5:26 AM GMT
Next Story