Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య కొత్త సినిమా వచ్చేది అప్పుడే...

ఈ మధ్య కాలమంతా సమంతతో ప్రేమాయణం అంటూ వార్తల్లో నిలిచాడు నాగచైతన్య. ఇప్పుడు మాత్రం తన సినిమాలతో సందడి చేస్తున్నాడు. అవును… చాన్నాళ్లుగా నాగచైతన్య చేస్తున్న ప్రేమమ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. కాస్త ఆలస్యంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ… తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమమ్ ను సెప్టెంబర్ 9 విడుదల చేయాలని అనుకుంటున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా విడుదల […]

నాగచైతన్య కొత్త సినిమా వచ్చేది అప్పుడే...
X

ఈ మధ్య కాలమంతా సమంతతో ప్రేమాయణం అంటూ వార్తల్లో నిలిచాడు నాగచైతన్య. ఇప్పుడు మాత్రం తన సినిమాలతో సందడి చేస్తున్నాడు. అవును… చాన్నాళ్లుగా నాగచైతన్య చేస్తున్న ప్రేమమ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. కాస్త ఆలస్యంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ… తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమమ్ ను సెప్టెంబర్ 9 విడుదల చేయాలని అనుకుంటున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేస్తుండడం విశేషం. ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున రెండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు నాగచైతన్య. ఎన్నో అంచనాల మధ్య చేసిన దోచెయ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకేసారి గౌతమ్ మీనన్ సినిమా సాహసం శ్వాసగా సాగిపో, చందు మొండేటి సినిమా ప్రేమమ్ లను తెరపైకి తెచ్చాడు. వీటిలో మొదట ప్రేమమ్ విడుదలకానుంది. ఇది విడుదలైన నెల రోజుల గ్యాప్ లో సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఈ రెండు సినిమాలపై చైతూ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

First Published:  20 July 2016 12:39 AM GMT
Next Story