Telugu Global
Health & Life Style

బైపాస్ స‌ర్జ‌రీలో ఆమెకు వీపు  కాలింది...డాక్ట‌ర్లు నష్ట‌ప‌రిహారం చెల్లించారు!

ముగ్గురు డాక్ట‌ర్లు క‌లిసి ఓ మ‌హిళ‌కు బైపాస్ స‌ర్జ‌రీ చేస్తుండ‌గా,  శ‌రీరానికి వేడినిచ్చే ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రంలో ఒక్క‌సారిగా వేడి పెరిగిపోయి పెషంటుకి  వీపు కాలింది. వినియోగ‌దారుల ఫోరం ఆ ఆసుప‌త్రి, డాక్ట‌ర్ల నుండి ఆ మ‌హిళ‌కు ఏడుల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌ష్ట‌పరిహారం ఇప్పించింది. 2000వ సంవ‌త్స‌రంలో క‌మ‌ల్ ధామ‌న్ అనే మ‌హిళ ముంబ‌యిలోని సియాన్ ఆసుప‌త్రిలో బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకుంది. ఒక మ‌త్తు ఇచ్చే డాక్ట‌రుతో పాటు ముగ్గురు డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ లో పాల్గొన్నారు. అయితే  స‌ర్జ‌రీ స‌మ‌యంలో.. […]

ముగ్గురు డాక్ట‌ర్లు క‌లిసి ఓ మ‌హిళ‌కు బైపాస్ స‌ర్జ‌రీ చేస్తుండ‌గా, శ‌రీరానికి వేడినిచ్చే ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రంలో ఒక్క‌సారిగా వేడి పెరిగిపోయి పెషంటుకి వీపు కాలింది. వినియోగ‌దారుల ఫోరం ఆ ఆసుప‌త్రి, డాక్ట‌ర్ల నుండి ఆ మ‌హిళ‌కు ఏడుల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌ష్ట‌పరిహారం ఇప్పించింది.

2000వ సంవ‌త్స‌రంలో క‌మ‌ల్ ధామ‌న్ అనే మ‌హిళ ముంబ‌యిలోని సియాన్ ఆసుప‌త్రిలో బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకుంది. ఒక మ‌త్తు ఇచ్చే డాక్ట‌రుతో పాటు ముగ్గురు డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ లో పాల్గొన్నారు. అయితే స‌ర్జ‌రీ స‌మ‌యంలో.. పేషంటు బాడీ టెంప‌రేచ‌ర్‌ని స్థిరంగా ఉంచే ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రం స‌రిగ్గా లేక‌పోవ‌టంతో ఒక్క‌సారిగా వేడి పెరిగిపోయి ఆప‌రేష‌న్ టేబుల్… శ‌రీరం కాలిపోయేంత‌గా వేడెక్కిపోయింది. క‌మ‌ల్ త‌న వీపు కాలిపోతోంద‌ని చెప్పినా డాక్ట‌ర్లు వినిపించుకోకుండా బ‌ల‌వంతంగా ఆమెను ఆప‌రేష‌న్ టేబుల్‌కి నొక్కిపెట్టారు. త‌రువాత ఆమె మ‌త్తులోకి వెళ్లిపోయింది. ఆప‌రేష‌న్ అనంత‌రం స్పృహలోకి వ‌చ్చాక క‌మ‌ల్‌కి వీపు బాగా నొప్పిగా అనిపించింది. వీపుకి బొబ్బ‌లు కూడా వ‌చ్చాయి. వేడిని ఇచ్చే ప‌రిక‌రం తాలూకూ మానిట‌ర్ 45 డిగ్రీల సెల్సియ‌స్‌కి వెళ్లిపోవ‌టంతోనే అలా జ‌రిగింద‌ని డాక్ట‌ర్లు గుర్తించారు.

కోలుకున్న త‌రువాత ఆమె డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం గురించి ప్ర‌శ్నించ‌గా అది త‌మ త‌ప్పు కాద‌ని, ఆ ప‌రిక‌రాన్ని ఆప‌రేష‌న్ కోసం ఇచ్చిన ఆసుప‌త్రిదే త‌ప్ప‌ని డాక్ట‌ర్లు వాదించారు. డాక్ట‌ర్లతోనూ, ఆసుప‌త్రితోనూ ఎంత వాదించినా త‌నకు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌టంతో చివ‌రికి క‌మ‌ల్, 2007లో కేంద్ర వినియోగ‌దారుల వివాదాల ప‌రిష్కార ఫోరంకి పిర్యాదు చేసింది. వాద ప్ర‌తివాద‌న‌ల అనంత‌రం….ఇన్నేళ్ల త‌రువాత, ముగ్గురు డాక్ట‌ర్లు, సియాన్ అసుప‌త్రి క‌లిసి క‌మ‌ల్‌కి ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల‌ని కన్ జూమ‌ర్ ఫోరం ఇటీవ‌ల ఆదేశించింది. ఆసుప‌త్రి ఇచ్చిన ప‌రిక‌రాల‌ను తాము వినియోగించామ‌ని, త‌మ‌దేం బాధ్య‌త లేద‌న్న డాక్ట‌ర్ల వాద‌న‌ను ఫోరం తోసిపుచ్చింది. వైద్యులు ముందుగా ప‌రిక‌రాలు స‌రిగ్గా ఉన్నాయా లేదా అన్న‌ది చెక్ చేసుకోవాల‌ని, ఆమెకు కాలిన గాయ‌ం అయింది…ఆప‌రేష‌న్ చేస్తున్న‌పుడే క‌నుక‌, ఆప‌రేష‌న్ ఫ‌లితానికే కాక‌, అందుకు కూడా వారు బాధ్యులేన‌ని ఫోరం పేర్కొంది.

First Published:  20 July 2016 5:13 AM GMT
Next Story