Telugu Global
Cinema & Entertainment

మరో రికార్డు సృష్టించిన సుల్తాన్

సల్మాన్ ఖాన్-అనుష్క శర్మ  హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సుల్తాన్. మల్లయోధుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు క్రియేట్ అయిన రికార్డులన్నింటినీ సుల్తాన్ అధిగమించింది. ఇక ఈ సినిమా కన్ను ఇప్పుడు ఆల్ టైం రికార్డుల మీదే ఉంది. బాహుబలి రికార్డులతో పాటు… పీకే, ధూమ్-3 సాధించిన ఆల్ టైం రికార్డుల్ని అధిగమించాలని సుల్తాన్ భావిస్తున్నాడు. ఇక తాజా రికార్డుల విషయానికొస్తే… ఈ సినిమా కేవలం […]

మరో రికార్డు సృష్టించిన సుల్తాన్
X

సల్మాన్ ఖాన్-అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సుల్తాన్. మల్లయోధుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు క్రియేట్ అయిన రికార్డులన్నింటినీ సుల్తాన్ అధిగమించింది. ఇక ఈ సినిమా కన్ను ఇప్పుడు ఆల్ టైం రికార్డుల మీదే ఉంది. బాహుబలి రికార్డులతో పాటు… పీకే, ధూమ్-3 సాధించిన ఆల్ టైం రికార్డుల్ని అధిగమించాలని సుల్తాన్ భావిస్తున్నాడు. ఇక తాజా రికార్డుల విషయానికొస్తే… ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 5వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఇంకా తక్కువ రోజుల్లోనే 5వందల కోట్ల రూపాయలు సాధిస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఎలా అంటే విడుదలైన 4 రోజుల్లోనే 2వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ సినిమా. ఇదే ఊపుకొనసాగితే… దాదాపు 10 రోజుల్లోనే 5వందల కోట్ల రూపాయలు వచ్చేస్తాయని అంతా ఊహించారు. కానీ 5వందల కోట్ల రూపాయలు సాధించడానికి సుల్తాన్ కు 12 రోజులు సమయం పట్టింది. ప్రస్తుతం ఈ సినిమా హవా తగ్గింది. అయినప్పటికీ… బరిలో మరో సినిమా పోటీలో లేకపోవడంతో సుల్తాన్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే అడల్ట్ బూతు సినిమా విడుదలైనప్పటికీ… ఆ సినిమా సుల్తాన్ పై ఏమాత్రం ప్రభావం చూపించదని అంటున్నారు. సో… ఈ వీకెండ్ గడిచేసరికి సుల్తాన్ మరిన్ని రికార్డుల్ని అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

First Published:  20 July 2016 12:24 AM GMT
Next Story