Telugu Global
Health & Life Style

రొమ్ము క్యాన్స‌ర్ రోగుల‌కు ఆక్యుఫ్రెష‌ర్‌తో ఉప‌శ‌మ‌నం

అల‌స‌ట‌, నిస్ప‌త్తువ నుంచి రొమ్ము క్యాన్స‌ర్ రోగుల‌కు ఆక్యుఫ్రెష‌ర్ థెర‌పీ అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. అమెరికాలోని మిచిగాన్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కురాలు సుజ‌నా జిక్ బృందం ఈ అంశంపై అధ్య‌య‌నం పూర్తి చేసింది.  మొత్తం 288 మంది రోగుల‌పై ఈ ప‌రిశోధ‌న కొన‌సాగించారు. రోగుల్లో కొంద‌రిని సాధార‌ణ మందుల‌నే వాడ‌మ‌న్నారు. మ‌రిక‌కొంద‌రికీ  మాత్రం మునివేళ్ల‌తో, చిన్న ప‌రిక‌రాల‌తో నాడి కేంద్రాల‌పై మ‌ర్ద‌న చేశారు. ఇలా రోజుకు 3 నిమిషాల పాటు చేశారు. ఆరు […]

అల‌స‌ట‌, నిస్ప‌త్తువ నుంచి రొమ్ము క్యాన్స‌ర్ రోగుల‌కు ఆక్యుఫ్రెష‌ర్ థెర‌పీ అద్భుతంగా ప‌ని చేస్తున్న‌ద‌ని తాజా అధ్య‌య‌నంలో తేలింది. అమెరికాలోని మిచిగాన్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కురాలు సుజ‌నా జిక్ బృందం ఈ అంశంపై అధ్య‌య‌నం పూర్తి చేసింది. మొత్తం 288 మంది రోగుల‌పై ఈ ప‌రిశోధ‌న కొన‌సాగించారు. రోగుల్లో కొంద‌రిని సాధార‌ణ మందుల‌నే వాడ‌మ‌న్నారు. మ‌రిక‌కొంద‌రికీ మాత్రం మునివేళ్ల‌తో, చిన్న ప‌రిక‌రాల‌తో నాడి కేంద్రాల‌పై మ‌ర్ద‌న చేశారు. ఇలా రోజుకు 3 నిమిషాల పాటు చేశారు. ఆరు వారాల త‌రువాత ఆక్యుఫ్రెష‌ర్ మ‌ర్ద‌న పొందిన వారిలో ఎంతో ఉత్తేజంగా ఉన్న‌ట్లు గుర్తించారు. త‌రచుగా అనారోగ్యానికి గుర‌య్యే క్యాన్స‌ర్ రోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే చికిత్స‌లు ప‌రిమితంగానే ఉన్నాయి. ఆక్యుఫ్రెష‌ర్ విధానంతో మ‌ర్ధ‌న ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్న‌ట్టు గుర్తించామ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఇందుక‌య్యే వ్య‌యం కూడా త‌క్కువేన‌ని చెప్పారు. ఈ చికిత్స ప్ర‌మాద ర‌హిత‌మ‌ని కూడా ఆమె తెలిపారు. ఆక్యుఫ్రెష‌ర్ థెర‌పీకి మెద‌డు స్పందించే తీరును ప‌రిశీలించి కేవ‌లం ఒక్క నిమిషం చికిత్స‌తోనే మెరుగైన ఫ‌లితాన్ని రాబ‌ట్టే విధానాన్ని రూపొందిస్తామ‌ని సుజ‌నా వెల్ల‌డించారు. “జ‌మా అంకాల‌జీ”అనే ప‌త్రిక ఇటీవ‌ల దీనిపై ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.
First Published:  20 July 2016 10:07 AM GMT
Next Story