Telugu Global
Cinema & Entertainment

నేను గర్భవతిని కాదు...జస్ట్ లావెక్కానంతే...

హీరోయిన్ అనిత గుర్తుందా… నువ్వు-నేను, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన చిన్నది. అవును… ఈ అమ్మాడుకు మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో కలావర్ కింగ్ లాంటి సినిమాల్లో ఐటెంసాంగ్స్ కూడా చేసింది. అవి కూడా క్లిక్ కాకపోవడంతో ఇక లాభం లేదనుకొని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను రెండేళ్ల కిందట పెళ్లాడిన అనిత… ఇప్పుడు సడెన్ గా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ప్రస్తుతం గర్భవతి […]

నేను గర్భవతిని కాదు...జస్ట్ లావెక్కానంతే...
X

హీరోయిన్ అనిత గుర్తుందా… నువ్వు-నేను, శ్రీరామ్, నిన్నే ఇష్టపడ్డాను లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన చిన్నది. అవును… ఈ అమ్మాడుకు మళ్లీ అవకాశాలు రాలేదు. దీంతో కలావర్ కింగ్ లాంటి సినిమాల్లో ఐటెంసాంగ్స్ కూడా చేసింది. అవి కూడా క్లిక్ కాకపోవడంతో ఇక లాభం లేదనుకొని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను రెండేళ్ల కిందట పెళ్లాడిన అనిత… ఇప్పుడు సడెన్ గా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ మీడియాలో తెగ ప్రచారం జరగడంతో అనిత స్పందించక తప్పలేదు.

ఈమధ్యే కరీనాకపూర్ గర్భవతి అనే విషయం తేలడంతో… ఈ బాపతు ఇంకెవరైనా ఉన్నారేమోనని మీడియా ఆరాతీసింది. ఇందులో భాగంగా రెండేళ్ల కిందట పెళ్లిచేసుకున్న అనిత గుర్తొచ్చింది. పైగా ఈమధ్య కాలంలో కాస్త పొట్టతో, లావుగా ఉన్న అనితను చూసిన మీడియా జనాలు.. ఆమె కూడా గర్భవతి అంటూ రాసేశారు. కానీ అనిత మాత్రం తను ప్రెగ్నెంట్ కాదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం డైటింగ్ మానేశానని,… పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు విచ్చలవిడిగా తింటున్నానని… అందుకే పొట్ట వచ్చి, కాస్త లావుగా తయారయ్యానని వివరణ ఇచ్చుకుంది. ఒకవేళ తనకు బాబో, పాపో పుడితే ఆ విషయాన్ని కచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటానని కూడా హామీ ఇచ్చింది అనిత.

First Published:  20 July 2016 3:15 AM GMT
Next Story