Telugu Global
Health & Life Style

కాఫీతో వినికిడి స‌మ‌స్య 

త‌ర‌చుగా భారీ శ‌బ్దాల‌ను వినేవారు రోజూ కాఫీ తాగితే వినికిడి స‌మ‌స్య శాశ్వ‌తంగా ఉండిపోయే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కెన‌డాకు చెందిన మెక్‌గ్రిల్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు భారీ పేలుళ్లు, నిర్మాణ స‌మ‌యంలో విడుద‌ల‌య్యే శ‌బ్దాలు, ప‌బ్బుల్లో వినిపించే హెచ్చుస్థాయి సౌండ్స్,సంగీతం, విమానాలు, రైళ్ల‌రాక‌పోక‌ల శ‌బ్దాల‌ను విన్న త‌రువాత మూడు రోజుల వ‌ర‌కు చెవుల స్థితి సాధార‌ణ స్థాయికి రాద‌ని గుర్తించారు. అయితే కాఫీ తాగ‌డం వ‌ల్ల చెవుల ప‌నితీరు మంద‌గిస్తుంద‌నే విష‌యాన్ని క‌నుగొన్నారు. తాత్కాలిక వినికిడి స‌మ‌స్య […]

కాఫీతో వినికిడి స‌మ‌స్య 
X
త‌ర‌చుగా భారీ శ‌బ్దాల‌ను వినేవారు రోజూ కాఫీ తాగితే వినికిడి స‌మ‌స్య శాశ్వ‌తంగా ఉండిపోయే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కెన‌డాకు చెందిన మెక్‌గ్రిల్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు భారీ పేలుళ్లు, నిర్మాణ స‌మ‌యంలో విడుద‌ల‌య్యే శ‌బ్దాలు, ప‌బ్బుల్లో వినిపించే హెచ్చుస్థాయి సౌండ్స్,సంగీతం, విమానాలు, రైళ్ల‌రాక‌పోక‌ల శ‌బ్దాల‌ను విన్న త‌రువాత మూడు రోజుల వ‌ర‌కు చెవుల స్థితి సాధార‌ణ స్థాయికి రాద‌ని గుర్తించారు. అయితే కాఫీ తాగ‌డం వ‌ల్ల చెవుల ప‌నితీరు మంద‌గిస్తుంద‌నే విష‌యాన్ని క‌నుగొన్నారు. తాత్కాలిక వినికిడి స‌మ‌స్య త‌లెత్తున్న‌ద‌నే విష‌యాన్ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. దీనినే వారు టెంప‌రీ త్రెషోల్డ్ షిఫ్టు అని పిలుస్తున్నారు. ఆ త‌రువాత 72 గంట‌ల్లో చెవులు పూర్తి స్థాయిలో కోలుకుంటాయ‌ని గుర్తించారు. కాగా రోజూ కాఫీ తాగితే అది వినికిడి స‌మ‌స్య ప‌రిష్కారం కాకుండా అడ్డుకుంటుంద‌నే విష‌యాన్ని ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు. ఈ విష‌యాన్ని మెక్ గ్రిల్ ఆడిట‌ర్ సైన్స్ ప్ర‌యోగ‌శాల‌కు చెందిన డాక్ట‌ర్ ఫైజ‌ల్ జ‌వావి వివ‌రించారు. శ‌బ్దాలు ఎక్కువ‌గా వ‌చ్చే ప్రాంతాల్లో నివ‌సించే వారు కాఫీ తాగ‌డాన్ని త‌గ్గించ‌డం మంచిద‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు.
First Published:  20 July 2016 11:13 PM GMT
Next Story