Telugu Global
Others

బాబరీ కోసం పోరాడిన హాషిం అన్సారీ మృతి

రామజన్మ భూమి-బాబరీ మసీదు కేసులో దీర్ఘకాలంగా కోర్టు కేసులు నడుపుతున్న హాషిం అలీ అనసారీ బుధవారం ఉదయం మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు 95 ఏళ్లు. 1949 నుంచి ఆయన బాబరీ మసీదు కేసులో పోరాడుతూనే ఉన్నారు. 19992 డెసెంబర్ 6న కరసేవకులు బాబరీ మసీదును కూల్చివేయడాన్ని అన్సారీ తీవ్రంగా నిరసించారు. బాబరీ విధ్వంసం తర్వాత దుండగులు ఆయన ఇంటిని కూడా దగ్ధం చేశారు. ఆయన బాబరీ విషయంలో పోరాటం కొనసాగిస్తున్న ఇదే […]

బాబరీ కోసం పోరాడిన హాషిం అన్సారీ మృతి
X

రామజన్మ భూమి-బాబరీ మసీదు కేసులో దీర్ఘకాలంగా కోర్టు కేసులు నడుపుతున్న హాషిం అలీ అనసారీ బుధవారం ఉదయం మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు 95 ఏళ్లు. 1949 నుంచి ఆయన బాబరీ మసీదు కేసులో పోరాడుతూనే ఉన్నారు.

19992 డెసెంబర్ 6న కరసేవకులు బాబరీ మసీదును కూల్చివేయడాన్ని అన్సారీ తీవ్రంగా నిరసించారు. బాబరీ విధ్వంసం తర్వాత దుండగులు ఆయన ఇంటిని కూడా దగ్ధం చేశారు. ఆయన బాబరీ విషయంలో పోరాటం కొనసాగిస్తున్న ఇదే కేసులో పోరాడుతున్న రాం కేవల్ దాస్, రామచంద్ర పరమ హంస, దిగంబర్ అఖాడాతో ఎన్ని విభేదాలున్నా ఆ వ్యక్తులతో, సంస్థలతో ఆయన స్నేహం చెక్కుచెదరలేదు.

1961లో సున్నీ కేంద్ర వక్ఫ్ బోర్డు తరఫున మరో ఆరుగురితో కలిసి అన్సారీ కూడా కేసు దాఖలు చేశారు.

కేసు దాఖలు చేసినందుకు కర సేవకులు ఆయన మీద చాలా ఆగ్రహించారు. బాబరీ విధ్వంసానికి ఒక రోజు ముందు ఆయన తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా కొంత మంది కరసేవకులు వచ్చి బూతులు తిడుతూ ఆ అన్సారీ ఎక్కడ అని అడిగారు. ఎందుకు అని ఆయన అడిగితే ఈ జగడానికంతటికీ వాడే కారణం. వాడు తగిన మూల్యం చెల్లించవలసిందేనని గద్దించారు.

అన్సారీకి కరసేవకుల ఉద్దేశం ఏమిటో అర్థమై ఆ వ్యక్తి అవతలి వీధిలో ఉంటాడని చెప్తే వారు అటు వేపు దూసుకెళ్లారు. వారు అక్కడే దాక్కున్నారు. “ఆ తర్వాత కొద్ది రోజులదాకా నేను ఇంటి నుంచి బయటకు రాలేదు” అని అన్సారీ చెప్పారు. అన్సారీ పేరు అందరికీ పరిచితమే కాని ఆ రోజుల్లో టీవీ అంత ప్రాచుర్యంలో లేనందువల్ల అన్సారీని కరసేవకులు గుర్తు పట్టలేదు.

సన్నగా బక్కపలచగా ఉండే అన్సారీ పొడవాటి కుడ్తా వేసుకుని లుంగీ కట్టుకునేవాడు. అన్సారీ అంతర్ముఖుడు. పెద్దగా చదువుకోలేదు. కాని బాబరీ వివాదానికి సంబంధించి సకల విషయాలు ఆయనకు తెలుసు. బాబరీ మసీదులోంచి అజాన్ ఇచ్చినందుకు 1952లో ఆయన రెండేళ్ల జైలు శిక్షకూడా అనుభవించారు. బాబరీ స్థల వివాదంలో కేసు వేసిన తర్వాత ఆయన ముస్లింల తరఫున పోరాడుతున్న ప్రముఖుడై పోయారు. అనేక కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంగా పోరాడుతూనే ఉన్నారు.

అయోధ్యలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన అన్సారీ జీవితం అంతా పేదరికంలోనే గడిచింది. నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రి కరీంబక్షా మరణించారు. తల్లి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేది. అన్న ఖాసిం అన్సారీ సైకిల్ మరమ్మతు దుకాణం నడపడం వల్ల ఆ కుటుంబం కొంత స్థిరపడింది. పెద్దవాడైన తర్వాత హాషిం అన్సారీ బట్టలు కుట్టే దుకాణంలో పని చేసే వాడు. వారు బాబరీ మసీదును ఆక్రమించుకున్న తర్వాత నా జీవితానికి ఓ పరమార్థం ఏర్పడింది అనేవాడు.

బాబరీ విధ్వంసం తర్వాత అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ప్రతినిధులు ఇద్దరు హాషిం అన్సారీ దగ్గరకు వచ్చి కోర్టు వెలుపప పరిష్కారానికి ఒప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని, రెండు పెట్రోల్ బంకులు కేటాయిస్తామని చెప్పారు. అన్సారీ కోపోద్రిక్తుడై కుర్చీలోంచి లేచి వారిని తరిమేశారు అని ఆయన సన్నిహితుడు ఖాలిఖ్ అహమద్ ఖాన్ చెప్పారు.

అన్సారీ నిజాయితీతో పాటు ఆయనకు న్యాయస్థానాల మీద అపారమైన విశ్వాసం ఉండేది. “ఈ కేసు కోర్టులో పరిష్కారం అయ్యేదాకా కోర్టు వెలుపల ఏ పరిష్కారాన్ని అంగీకరించను అని కరాఖండిగా చెప్పిన ధీశాలి అన్సారి.

First Published:  21 July 2016 1:29 AM GMT
Next Story