బిగ్ బ్రేకింగ్… జనతా గ్యారేజ్ లో తమన్న

జనతా గ్యారేజీలో సమంత హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. నిత్యామీనన్ మరో హీరోయిన్ గా నటిస్తోందనే విషయం కూడా తెలుసు. కానీ సడెన్ గా ఈ ప్రాజెక్టులోకి మిల్కీబ్యూటీ ఎంటరైంది. అది కేవలం ఎన్టీఆర్ పై  ఉన్న అభిమానంతోనే. అవును.. జనతా గ్యారేజ్ సినిమాలో తమన్న ఐటంసాంగ్ ఉంది. నిజంగా ఇది యంగ్ టైగర్ అభిమానులకు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూసే. 
భారీ తారాగణంతో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా పుష్పక విమానాన్ని తలపిస్తోంది. ఏ క్యారెక్టర్ పేరు చెప్పినా హైప్ క్రియేట్ అవుతోంది. అలాంటి ప్రాజెక్టులోకి తమన్నాను కూడా తీసుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. క్లైమాక్స్ కు ముందు తమన్న-తారక్ మధ్య అదిరిపోయే ఐటెంసాంగ్ వస్తుందట. ఓ ఐటెంసాంగ్.. ఆ వెంటనే భారీ క్లయిమాక్స్ ఇలా జనతా గ్యారేజ్ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ లా తయారవుతోందట. 
నిజానికి క్లయిమాక్స్ ముందు వచ్చే ఈ సాంగ్ ను కూడా హీరోయిన్ సమంతతోనే ప్లాన్ చేశారట. కాకపోతే… ఆ సాంగ్ లో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకొని డాన్స్ చేసేందుకు సమంత ఒప్పుకోలేదట. దీంతో ఆఖరి నిమిషంలో ఆ పాటను తమన్నాతో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇందుకోసమే సినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారని అంటున్నారు.