Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ లో అతిపెద్ద మూడో చిత్రంగా సుల్తాన్

సుల్తాన్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సినిమాకు ట్రెమండస్ టాక్ రావడంతో పాటు… మరో బాలీవుడ్ సినిమా బరిలో లేకపోవడంతో సుల్తాన్ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో అతిపెద్ద చిత్రంగా అవతరించింది. అమీర్ నటించిన ధూమ్-3 సినిమా వసూళ్లను తాజాగా అధిగమించాడు సుల్తాన్. దీంతో హిందీలో భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. మొదటి స్థానంలో సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ నిలవగా… […]

బాలీవుడ్ లో అతిపెద్ద మూడో చిత్రంగా సుల్తాన్
X

సుల్తాన్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సినిమాకు ట్రెమండస్ టాక్ రావడంతో పాటు… మరో బాలీవుడ్ సినిమా బరిలో లేకపోవడంతో సుల్తాన్ వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో అతిపెద్ద చిత్రంగా అవతరించింది. అమీర్ నటించిన ధూమ్-3 సినిమా వసూళ్లను తాజాగా అధిగమించాడు సుల్తాన్. దీంతో హిందీలో భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. మొదటి స్థానంలో సల్మాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ నిలవగా… రెండో స్థానంలో అమీర్ నటించిన పీకే సినిమా ఉంది. మూడో స్థానంలో ఉన్న ధూమ్-3ను ఇప్పుడు సుల్తాన్ ఆక్రమించాడు.

ఇక అంతర్జాతీయ వసూళ్లతో కలుపుకుంటే సుల్తాన్ సినిమా ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమా ధూమ్-3కి దగ్గరగా కొనసాగుతోంది. ధూమ్-3కి ఓవర్సీస్ తో కలుపకొని 542 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ధూమ్-3 (542 కోట్లు), బాహుబలి (600 కోట్లు), భజరంగీ భాయ్ జాన్ (626 కోట్లు), పీకే (792 కోట్లు) సినిమాలున్నాయి. వీటితో భజరంగీ భాయ్ జాన్ వరకు సుల్తాన్ సినిమా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ ఊహిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పెద్దగా లేకపోవడంతో… లాంగ్ రన్ లో సుల్తాన్ సినిమా.. భజరంగీ భాయ్ జాన్ ను అధిగమించే అవకాశాలున్నాయని అంటున్నారు. పీకేను మాత్రం ఇది క్రాస్ చేసే ఛాన్స్ లేదని అంచనా వేస్తున్నారు.

First Published:  22 July 2016 11:11 AM GMT
Next Story