గల్లా నుంచి కాపాడండి – సీఎంను ఆశ్రయించిన మహిళ

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన భూములు, ఇళ్లను ఆక్రమించడమే పనిగా పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 350కోట్ల విలువైన చక్కెర ఫ్యాక్టరీ భూములను గల్లా సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడంపై అక్కడి రైతులు నిప్పులు చెరుగుతున్నారు. సొంతజిల్లానే కాదు వలసవెళ్లిన గుంటూరు జిల్లాలోనూ గల్లా అదే పంథాలో ముందుకెళ్తున్నారు. గుంటూరులో అద్దెకు ఉంటున్న ఇంటికే గల్లా జయదేవ్‌ టెండర్‌ పెట్టేశారు. బ్యాంకు అధికారులతో కుమ్మకై ఇంటి ఓనర్‌కే సున్నం పెట్టేశారు. ఇప్పుడు ఇంటి యజమానురాలు పద్మజ ఏకంగా చంద్రబాబును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గల్లా జయదేవ్‌ నుంచి తమను రక్షించాలని కోరారు. గల్లా చేసిన తప్పుపై ప్రశ్నిస్తుంటే టీడీపీ నేతల సాయంతో బెదిరస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అసలు మ్యాటర్ ఏమిటంటే…

గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని గుంటుపల్లి పద్మజ కొన్నేళ్ల క్రితం నిర్మించారు. 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించక నెలనెల ఈఎంఐ కట్టలేకపోయారు. అదే సమయంలో 2014లో ఈ భవనాన్ని గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని సొమ్ము చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గల్లా జయదేవ్ తో… బ్యాంకు డీజీఎం కుమ్మకయ్యారని తెలుస్తోంది. రిజర్వ్ ధరను మరీ దారుణంగా తగ్గించేశారు. దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే ఈ భవనానికి వేలంలో ప్రారంభ ధరను కేవలం రూ. 2.80 కోట్లుగా నిర్ణయించేశారు. వేలం ప్రకటన జారీ చేశారు.

మంచి ఏరియాలో భవనం కావడంతో దీన్ని సొంతం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే అలా ఇంటిని చూసేందుకు, వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వారిని తెలుగు తమ్ముళ్లు బెదిరించడం ప్రారంభించారు. ”ఎంపీ ఉంటున్న ఇల్లు… ఒకవేళ మీరు వేలం పాటలో గెలుచుకున్నా గల్లా వారిని ఖాళీ చేయించే దమ్ముందా… ఖాళీ చేయించి ఇంటిని స్వాధీనం చేసుకునేంత సినిమా ఉందా” అంటూ వేలంపాటలో పాల్గొనేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించారు. ఇదే సమయంలో బ్యాంకు అధికారులు కూడా గల్లావారికి చేయాల్సిన సేవ చేస్తూ వచ్చారు.

ఇంటి వేలం గురించి తెలుసుకున్నయజమాని పద్మజ డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. అందుకు ట్రిబ్యునల్ కూడా అంగీకరించింది. అయినా సరే అప్పటికే గల్లా జయదేవ్‌తో చెలిమి చేసిన బ్యాంకు అధికారులు ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం తుంగలో తొక్కేశారు.

రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేసి ఆ తర్వాతే వేలం పాట నిర్వహించాలి. కానీ బ్యాంకు అధికారులు మాత్రం అద్దెకుంటున్న గల్లాజయదేవ్‌ను ఖాళీ చేయించలేదు. పైగా ఆయనతో కుమ్మక్కు అయి తక్కువ ధరకే భవనాన్ని ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు కూడా భారీగా ముడుపులు ముట్టాయని చెబుతున్నారు. దీంతో బాధితులు సీఎంను కలిశారు. అయితే గతంలో టీడీపీ నేతలను చంద్రబాబు వెనుకేసుకొచ్చిన తీరును చూసిన తర్వాత గల్లాను సీఎంను ఎంతవరకు అడ్డుకుంటారన్నది చూడాలి.

Click on Image to Read:

undavalli-arun-kumar

kabali-review

ap-special-status

botsa

babu

99

kothapalli-geetha1

paritala-sunitha

sun-edition-solar-plant

ysrcp-party-wip-pinnelli-ratrujet

ys-jagan

kadapa-coporater

hero-shivaji

sachin

nagarjuna-Sumalatha-wedding

jc diwakar reddy anantapur collector shashidar

adi-reddy-apparao

lokesh