Telugu Global
Cinema & Entertainment

కబాలి ప్రీ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాట ఈ సినిమా అర్థరాత్రి నుంచే మొదలైంది. ప్రాధమిక సమాచారం ప్రకారం… కబాలి సినిమా తలైవ ఫ్యాన్స్ కోసమే పుట్టిన సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే…. గత రెండు సినిమాలు విక్రమసింహ, లింగ తరహాలో… కబాలి సినిమాకు మొదటి రోజు ఎలాంటి నెగెటివ్ టాక్ రాలేదు. విక్రమసింహ, లింగ సినిమాలకు మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ […]

కబాలి ప్రీ రివ్యూ
X

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాట ఈ సినిమా అర్థరాత్రి నుంచే మొదలైంది. ప్రాధమిక సమాచారం ప్రకారం… కబాలి సినిమా తలైవ ఫ్యాన్స్ కోసమే పుట్టిన సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే…. గత రెండు సినిమాలు విక్రమసింహ, లింగ తరహాలో… కబాలి సినిమాకు మొదటి రోజు ఎలాంటి నెగెటివ్ టాక్ రాలేదు. విక్రమసింహ, లింగ సినిమాలకు మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది. రెండో రోజు నుంచి పూర్తి స్థాయి ఫ్లాప్ సినిమాలుగా ముద్రపడిపోయాయి. కానీ కబాలి మాత్రం ఏ దశలోనూ ఫ్యాన్స్ ను నిరాశపరచలేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు… సాధారణ ప్రేక్షకుడు కూడా శాటిస్ ఫై అయిపోతాడు కబాలి సినిమా చూసి.

రజనీకాంత్ గత సినిమాల ప్రభావం దర్శకుడు పా రంజిత్ పై బాగానే పడింది. కబాలి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. అయితే ప్రేక్షకులు రజనీని ఎలా చూడాలని అనుకుంటున్నారో అది రంజిత్ కు బాగా తెలిసిపోయింది. అందుకే సినిమా మొత్తాన్ని వన్ మేన్ షో చేసేశాడు. నిజానికి కబాలి కోసం రంజిత్ ఎంచుకున్న స్టోరీలైన్ చాలా బాగుంది. మలేషియాలో బానిసలుగా బతుకుతున్న తమిళ ప్రజలు (దళితుల) కోసం ఓ సాధారణ వ్యక్తి, కబాలి (డాన్) గా ఎలా మారాడనేదే స్టోరీ. ఇందులో భాషా, అరుణాచలం, ముత్తు ఛాయలు కూడా చూపించారు. పైగా కూతురు సెంటిమెంట్ కూడా యాడ్ చేయడంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోయారు.

30ఏళ్ల యువకుడిగా, 60ఏళ్ల వృద్ధుడిగా రజనీకాంత్ చూపించిన వేరియేషన్ నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇక్కడ దర్శకుడి ప్రతిభ కంటే కేవలం సూపర్ స్టార్ ఇమేజ్, అనుభవం మాత్రమే పనికొచ్చిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే రజనీకాంత్ ను యువకుడిగా చూడాల్సి వచ్చినప్పుడు మాత్రం మేకప్ పరంగా సాధారణ ప్రేక్షకులు (అభిమానులు కాదు) కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ముందునుంచి అంతా ఊహించినట్టే… సినిమాకు కెమెరా పనితనం, ఎడిటింగ్ ఆయువుపట్టుగా నిలిచాయి. కొన్ని సన్నివేశాల్లో కెమెరా వర్క్ రజనీ స్టయిల్ ని కూడా డామినేట్ చేసిందనే విషయాన్ని అభిమానులు కూడా ఒప్పుకొని తీరాలి. ఇక సంగీతం పరంగా… నెరెప్పుడా (తెలుగులో నిప్పురా) అనే సాంగ్ కచ్చితంగా హిట్టవుతుందని ముందే అంతా ఊహించారు. సినిమాలో కూడా అదే జరిగింది.

ఓవరాల్ గా కబాలి చిత్రం రజనీకాంత్ అభిమానుల దాహాన్ని తీర్చింది. ఓవైపు రజనీ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేదనే పుకార్లు, మరోవైపు వరుసగా రెండు డిజాస్టర్ల మధ్య… వచ్చిన కబాలి చిత్రం తలైవ ఫ్యాన్స్ ను పూర్తిగా సంతృప్తి పరుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమిళనాట ఈ సినిమాకు ఎదురేలేదు. కాకపోతే… టాలీవుడ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 35 కోట్ల రూపాయలకు కొన్న ఈ సినిమా ఆ స్థాయిలో ఆడుతుందా అనేది అనుమానమే. ఇక్కడ టాలీవుడ్ సినిమాల నుంచి పోటీ లేదు కాబట్టి… కబాలి నెట్టుకొచ్చే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కబాలి లాంటి కథను సురేష్ కృష్ణ, కేఎస్ రవికుమార్ లాంటి సీనియర్ డైరక్టర్లు అయితే ఇంకా బాగా తీసేవారనే టాక్ రావడం కొసమెరుపు .

First Published:  22 July 2016 11:08 AM GMT
Next Story