పార్టీ ఆఫీసులకు స్థలాల కేటాయింపు… ఇక్కడా బుద్ధి పోనిచ్చుకోని బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన రాజధానిలో రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయించదలుచుకుంది. పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించే జీవో జారీ చేసింది. అయితే భూమి కేటాయింపులో చంద్రబాబు పెట్టిన నిబంధనలు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. అశాశ్వతమైన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా శాశ్వతమైన పార్టీ ఆఫీసులకు భూములు కేటాయించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా అవమానించే విధంగానే స్థలాన్ని కేటాయించారు చంద్రబాబు.

అసెంబ్లీలో 50శాతం కంటే ఎక్కువ సీట్లు ఉన్న పార్టీకి సీఆర్‌డీఏ పరిధిలో నాలుగు ఎకరాలు కేటాయిస్తున్నట్టు జీవో ఇచ్చారు. అంటే టీడీపీ ఎలాగో మెజారిటీ స్థానాలను గెలిచింది కాబట్టి ఆ పార్టీకి నాలుగు ఎకరాల భూమి తీసుకుంటారు చంద్రబాబు. ఇక 25 నుంచి 50 శాతం సీట్లు ఉన్న పార్టీకి అర ఎకరం కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం వైసీపీకి అర ఎకరం భూమి దక్కుతుంది.

ఇక 25 శాతం లోపు లేదంటే కనీసం ఒక సభ్యుడుంటే 300 గజాలను పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయిస్తామని ప్రభుత్వ జీవోలో చెప్పింది. ఈ నిబంధన బీజేపీ కోసమే పెట్టినట్టుగా ఉన్నారు. ఇక అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలకు స్థలం కేటాయించడం వీలుకాదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. అంటే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలకు స్థలాలు లేనట్టే.

50 శాతం కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి జిల్లాల్లో రెండు ఎకరాలు, 25 నుంచి 50 శాతం సీట్లు ఉంటే వెయ్యి గజాలు, కనీసం ఒక సభ్యుడుంటే 300 గజాలు కేటాయించింది. దీని బట్టి జిల్లాల్లోనూ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీలకు స్థలాలు లేనట్టే.

అయితే కొత్త రాష్ట్రంలో చంద్రబాబు ఇలాంటి నిబంధనలతో పార్టీలకు భూములు కేటాయించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. పార్టీ ఆఫీసులు శాశ్వతంగా ఒకేసారి నిర్మించుకునేవి. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు తన సొంతపార్టీకి నాలుగు ఎకరాలు కేటాయించుకున్నారు. కొన్ని సీట్ల తేడాతో అధికారం కోల్పోయిన ప్రధాన ప్రతిపక్షానికి మాత్రం కేవలం అర ఎకరం కేటాయించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి, టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతే అప్పడు చంద్రబాబు తన పార్టీ కోసం సీఆర్‌డీఏ పరిధిలో తీసుకున్న నాలుగు ఎకరాల భూమిలో మూడున్నర ఎకరాలను వెనక్కు ఇచ్చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఒక విధంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు సీఆర్‌డీఏ పరిధిలో పార్టీ ఆఫీస్ కట్టుకునే అర్హత కూడా లేదని చంద్రబాబు తీర్మానించేసినట్టుగా ఉన్నారు. దీనిపై కమ్యూనిస్టు పార్టీలు ఎలా స్పందిస్తాయో ? చంద్రబాబును నిలదీస్తాయా? మనవాడే కదా అని సర్దుకుపోతాయో చూడాలి.

Click on Image to Read:

cm-ramesh

kodumur ex mla murali krishna arrest

ttdp

paritala-sunitha

ysrcp-party-wip-pinnelli-ra

trujet

chandrababu-naidu

vijay-mallya

ys-jagan

kadapa-coporater

lagadapati

tdp mp tota narasimham

sun-edition-solar-plant

hero-shivaji

sachin

nagarjuna-Sumalatha-wedding

jc diwakar reddy anantapur collector shashidar

adi-reddy-apparao

lokesh