అనంతకు అత్తరు… అత్తారింటికి సొత్తులు

చంద్రబాబు రెండేళ్ల పాలనను పరిశీలిస్తే మూటలు ఒక ప్రాంతానికి, మాటలు మరొక ప్రాంతానికి అన్నతరహాలో సాగుతోంది. తనకు ఇష్టమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కాసులు కురిపించడం, అదే సమయంలో ఇతర జిల్లావారు ఫీల్ అవకుండా వారిపై ప్రేమానురాగాలు కురిపించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలా కనిపిస్తోంది. ఇప్పుడు ఆగస్టు 15 వేడుకలకు కూడా అదే సిద్దాంతాన్ని చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈసారి అనంతపురం వేదికగా ఆగస్టు 15 వేడుకలు జరుపనున్నారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తమ జిల్లాలో ఆగస్టు 15నిర్వహిస్తున్నారన్న ఆనందం అక్కడి ప్రజల్లో కనిపించడం లేదు. పైగా తమను చంద్రబాబు పిచ్చివాళ్లుగా భావిస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లావాసులు మండిపడుతున్నారు. ఆగస్టు 15 వేడుకలు నిర్వహించినంత మాత్రాన తమ కడుపు నిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

తనకు ఇష్టమైన ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుకునే సమయంలో ఇతర జిల్లాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చంద్రబాబు జిల్లాల వారీగా అసెంబ్లీలో ప్రాజెక్టులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీకి ఓటేసిన జిల్లా అంటూ అనంతపురానికి కాసిన్ని ఎక్కువ హామీలే ఇచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా అనంతపురంలో ఏర్పాటు చేస్తామన్న ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను కూడా చంద్రబాబు తన అత్తగారి జిల్లా వైపే తీసుకెళ్లారు. ఏడాదిలో హంద్రీనీవా పూర్తి చేస్తామన్నారు. కానీ రెండేళ్లు గడిచినా అది పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. స్మార్ట్‌సిటీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌, సెంట్రల్‌ వర్సిటీ, టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పడంతోపాటు హిందూపురంలో భారీగా పరిశ్రమలు పెడుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు చంద్రబాబు. కానీ అవన్నీ మిగిలిన హామీల్లాగే గాలిలో కలిసిపోయాయి. ఒక్క అనంతపురం జిల్లానే కాదు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి ఇదే. కేవలం వెనుకబడిన జిల్లాకు వచ్చినప్పుడు మాటల్లో విపరీతమైన ప్రేమ కురిపించడం, అభివృద్ది మాత్రం మొత్తం అత్తగారి జిల్లా చుట్టూ కేంద్రీకరించడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని సీమవాసులు విమర్శిస్తున్నారు.

Click on Image to Read:

galla-jayadev

undavalli-arun-kumar

kabali-review

ap-special-status

botsa

babu

99

kothapalli-geetha1

paritala-sunitha

sun-edition-solar-plant

ysrcp-party-wip-pinnelli-ratrujet

ys-jagan

kadapa-coporater

hero-shivaji

sachin

nagarjuna-Sumalatha-wedding

jc diwakar reddy anantapur collector shashidar

adi-reddy-apparao

lokesh