Telugu Global
Cinema & Entertainment

గుడ్డివాడిగా మారడానికి ప్రయత్నిస్తున్న రామ్

అంధుడి పాత్రలో ఓ సినిమా చేయబోతున్నానని రామ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఇప్పుడీ కుర్ర హీరో పని ప్రారంభించాడు. గుడ్డివాడిగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. టైం దొరికినప్పుడల్లా అంధుడిగా ఎలా కనిపించాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గుడ్డివాడిగా ఉన్న క్లిప్పింగులు చూస్తున్నాడు. దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాడు. అయితే సినిమాలో టోటల్ గా అంధుడిగా కనిపిస్తాడా… లేక ఒక పార్ట్ వరకే కళ్లులేని వాడిగా నటిస్తాడా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. […]

గుడ్డివాడిగా మారడానికి ప్రయత్నిస్తున్న రామ్
X

అంధుడి పాత్రలో ఓ సినిమా చేయబోతున్నానని రామ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి ఇప్పుడీ కుర్ర హీరో పని ప్రారంభించాడు. గుడ్డివాడిగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. టైం దొరికినప్పుడల్లా అంధుడిగా ఎలా కనిపించాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గుడ్డివాడిగా ఉన్న క్లిప్పింగులు చూస్తున్నాడు. దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నాడు. అయితే సినిమాలో టోటల్ గా అంధుడిగా కనిపిస్తాడా… లేక ఒక పార్ట్ వరకే కళ్లులేని వాడిగా నటిస్తాడా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ప్రస్తుతం కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు రామ్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. దసరాకు దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన వెంటనే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వస్తుంది. త్వరలోనే రామ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది.

First Published:  23 July 2016 3:20 AM GMT
Next Story