Telugu Global
Cinema & Entertainment

పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చిన మహేష్..?

ఊపిరి సినిమాతో హిట్ అందుకున్న వంశీ పైడిపల్లికి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ పని మీద బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. వచ్చేవారమే ఇది సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పీవీపీ బ్యానర్ పైనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రాధమికంగా ఒప్పుకున్నాడు మహేష్. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలతో మహేష్ షెడ్యూల్ మారిపోయింది. వంశీ పైడిపల్లిని కాదని మరోసారి కొరటాల శివతో […]

ఊపిరి సినిమాతో హిట్ అందుకున్న వంశీ పైడిపల్లికి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ పని మీద బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. వచ్చేవారమే ఇది సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పీవీపీ బ్యానర్ పైనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రాధమికంగా ఒప్పుకున్నాడు మహేష్. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలతో మహేష్ షెడ్యూల్ మారిపోయింది. వంశీ పైడిపల్లిని కాదని మరోసారి కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మహేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
బ్రహ్మోత్సవంతో పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు మహేష్. దీంతో ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇఁకా చెప్పాలంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో మురుగుదాస్ తో చేయబోతున్న కమర్షియల్ సినిమా తర్వాత… వంశీ పైడిపల్లితో ప్రయోగాత్మక సినిమా చేయడాన్ని రిస్క్ గా ఫీలయ్యాడు మహేష్. ఇదే గ్యాప్ లో కొరటాల శివ మరో మంచి స్టోరీలైన్ చెప్పడంతో… అతడికే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అలా కొరటాల రాకతో.. వంశీ పైడిపల్లికి హ్యాండ్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాంటోంది ఫిలింనగర్.
First Published:  25 July 2016 11:52 AM GMT
Next Story