Telugu Global
Cinema & Entertainment

ప‌రువుపోతుంద‌ని భ‌య‌ప‌డుతున్న ప్రొడ్యూస‌ర్‌..!

తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కు ఒక వాల్యూ వుంది.  మూవీ మొఘ‌ల్  రామనాయుడు  నిర్మించిన ఈ బ్యాన‌ర్ తెలుగు సినిమాకు ఒక గ‌ర్వం. ఆయ‌న మ‌ర‌ణించిన త‌రువాత‌.. ప్ర‌స్తుతం దగ్గుబాటి సురేష్  ఈ సంస్థ‌ను చూసుకుంటున్నారు.  గ‌త రెండేళ్ల నుంచి  సురేష్ బ్యాన‌ర్ లో  సినిమా లేదు. తాజాగా ఒక కొత్త ద‌ర్శ‌కుడి చెప్పిన క‌థ‌ను న‌మ్మి…పెళ్లి చూపులు చిత్రం చేశారు. ఈ మ‌ధ్య‌నే  ఈ చిత్రం ఆడియో విడుద‌ల కూడ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా […]

ప‌రువుపోతుంద‌ని భ‌య‌ప‌డుతున్న ప్రొడ్యూస‌ర్‌..!
X
తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కు ఒక వాల్యూ వుంది. మూవీ మొఘ‌ల్ రామనాయుడు నిర్మించిన ఈ బ్యాన‌ర్ తెలుగు సినిమాకు ఒక గ‌ర్వం. ఆయ‌న మ‌ర‌ణించిన త‌రువాత‌.. ప్ర‌స్తుతం దగ్గుబాటి సురేష్ ఈ సంస్థ‌ను చూసుకుంటున్నారు. గ‌త రెండేళ్ల నుంచి సురేష్ బ్యాన‌ర్ లో సినిమా లేదు. తాజాగా ఒక కొత్త ద‌ర్శ‌కుడి చెప్పిన క‌థ‌ను న‌మ్మి…పెళ్లి చూపులు చిత్రం చేశారు. ఈ మ‌ధ్య‌నే ఈ చిత్రం ఆడియో విడుద‌ల కూడ జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా మీ నిర్మాణ సంస్థ‌లో ఎందుకు చిత్రాలు ఎక్కువుగా రావ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. ఆయ‌న ఏది ప‌డితే అది చేస్తే.. మా బ్యాన‌ర్ ప‌రువు పోతుందన్నారు. అయితే త్వరలో చిత్రాల్ని నిర్మిస్తాం. కథల విషయంలో నేను రాజీ పడను. డబ్బులు, పరువు పోతాయని భయం. అందుకే ఓ కథని సినిమాగా మలిచే క్రమంలో సమయం తీసుకొంటా. త్వరలో వెంకటేష్‌తో ఒకటి, నాగచైతన్యతో ఒక సినిమా చేస్తాం. రానాతోనూ ఓ సినిమా నిర్మించే ఆలోచ‌న‌లో వున్న‌ట్లు తెలిపారు. రానా సోద‌రుడు కూడా హీరోగా ప‌రిచ‌యం కాబోతున్న విష‌యం తెలిసిందే. వంశీ లేడిస్ టైల‌ర్ సినిమాకు సీక్వెల్ గా ..స‌న్నాఫ్ లేడిస్ టైల‌ర్ అనే చిత్రంతో రానా సోద‌రుడు హీరోగా ఎంట్రీ కి సిద్దం అవుతున్నాడు.
Click on Image to Read:
ram-charan
First Published:  24 July 2016 11:11 PM GMT
Next Story