Telugu Global
Cinema & Entertainment

హ్యాండ్ మేడ్ బీర్లు తాగించబోతున్న బన్నీ

ఇన్నాళ్లూ బీర్లు అంటే అవి సీల్డ్ మాత్రమే. సీసాల్లో ఉన్నవి కొనుక్కొని తాగడమే. కానీ అప్పటికప్పుడు బీర్లు తయారుచేసే బ్రూవరీలో బీర్ తాగే అవకాశం మాత్రం హైదరాబాదీలకు లేదు. ఇప్పటివరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ బ్రూవరీని భాగ్యనగరానికి పరిచయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఎమ్-కిచెన్, హై-లైఫ్ అనే రెండు సంస్థలతో కలిసి హైదరాబాద్ లో 800-జూబ్లీ అనే కొత్త హ్యాంగవుట్ స్పాట్ ఏర్పాటుచేస్తున్నాడు. ఈ హాట్ స్పాట్ లో బ్రూవరీని నెలకొల్పబోతున్నాడు. అంటే అక్కడే బీర్ […]

ఇన్నాళ్లూ బీర్లు అంటే అవి సీల్డ్ మాత్రమే. సీసాల్లో ఉన్నవి కొనుక్కొని తాగడమే. కానీ అప్పటికప్పుడు బీర్లు తయారుచేసే బ్రూవరీలో బీర్ తాగే అవకాశం మాత్రం హైదరాబాదీలకు లేదు. ఇప్పటివరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ బ్రూవరీని భాగ్యనగరానికి పరిచయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఎమ్-కిచెన్, హై-లైఫ్ అనే రెండు సంస్థలతో కలిసి హైదరాబాద్ లో 800-జూబ్లీ అనే కొత్త హ్యాంగవుట్ స్పాట్ ఏర్పాటుచేస్తున్నాడు. ఈ హాట్ స్పాట్ లో బ్రూవరీని నెలకొల్పబోతున్నాడు. అంటే అక్కడే బీర్ తయారుచేసి, గ్లాసుల్లో పోసి ఇస్తారన్నమాట. దీంతో పాటు మరెన్నో అత్యాధునిక సౌకర్యాలతో… జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఈ నైట్ క్లబ్ ను ఏర్పాటుచేయబోతున్నాడు బన్నీ.

ఇప్పటివరకు కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు బన్నీ. మరే వ్యాపకం పెట్టుకోలేదు. ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుకోవడంతో పాటు వరుస విజయాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడంతో ఇప్పుడు మిగతా బిజినెస్ లపై దృష్టిపెట్టాడు. రామ్ చరణ్ ఇప్పటికే విమానాయాన రంగంలో అడుగుపెట్టాడు. పలువురు హీరోలకు రెస్టారెంట్లు, పబ్ లు ఉన్నాయి. రవితేజ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడు. వీళ్ల జాబితాలోకి ఇప్పుడు ఫ్రెష్ గా బన్నీ కూడా చేరిపోయాడు.

First Published:  25 July 2016 9:00 PM GMT
Next Story