Telugu Global
Cinema & Entertainment

మూడో షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్

హీరోయిన్ లేకుండానే చిరంజీవి సినిమా పరుగులుపెడుతోంది. కనీసం విలన్ కూడా కన్ ఫర్మ్ కాకుండానే కత్తిలాంటోడు ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటికి మొన్న మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ నడుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల సమీపంలో ఉన్న ఓ గ్రామం వద్ద ఈ షూటింగ్ నడుస్తోంది. ఇదైపోగానే… త్వరలోనే మూడో షెడ్యూల్ కు కూడా సిద్ధమైపోతోంది చిరు 150-యూనిట్. మూడో షెడ్యూల్ ను నానక్ రామ్ గూడలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ […]

మూడో షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్
X

హీరోయిన్ లేకుండానే చిరంజీవి సినిమా పరుగులుపెడుతోంది. కనీసం విలన్ కూడా కన్ ఫర్మ్ కాకుండానే కత్తిలాంటోడు ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటికి మొన్న మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ నడుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ల సమీపంలో ఉన్న ఓ గ్రామం వద్ద ఈ షూటింగ్ నడుస్తోంది. ఇదైపోగానే… త్వరలోనే మూడో షెడ్యూల్ కు కూడా సిద్ధమైపోతోంది చిరు 150-యూనిట్. మూడో షెడ్యూల్ ను నానక్ రామ్ గూడలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ కోసం అక్కడ భారీ సెట్ ఏర్పాటుచేస్తున్నారు. తోట తరణి ఆధ్వర్యంలో ఈ సెట్ రూపుదిద్దుకుంటోంది. అయితే మూడో షెడ్యూల్ ఎప్పట్నుంచి ప్రారంభం అవుతుంది… అప్పటికి హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తారా అనే విషయాలు మాత్రం తేలాల్సి ఉంది.

తాజా సమాచారం ప్రకారం… చిరంజీవి 150వ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. మరోవైపు కాజల్ ప్రత్యేకంగా చేవెళ్ల వెళ్లి మరీ… సెట్స్ లో చిరంజీవితో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సో… ఈసారి కాజల్ కన్ ఫర్మ్ అని అంటున్నారు చాలామంది. అటు విలన్ గా కూడా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. వివేక్ కూడా ప్రస్తుతానికి ఖాళీనే కాబట్టి… 150వ సినిమాలో నటించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు.

First Published:  26 July 2016 1:20 AM GMT
Next Story